Asianet News TeluguAsianet News Telugu

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 397.04 పాయింట్లు జంప్.. .76 శాతం లాభంతో నిఫ్టీ..

ఉదయం ప్రారంభం నుండి కాస్త అస్థిరత తరువాత బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్  ప్రైమరీ ఇండెక్స్ సెన్సెక్స్ 397.04 పాయింట్లు (0.76 శాతం) పెరిగి 52,769.73 వద్ద ముగియగా మరోవైపు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 119.75 పాయింట్ల (0.76 శాతం) లాభంతో 15,812.35 వద్ద ముగిసింది.  

sensex nifty today:share market closed today latest news 13 july 2021 closing indian benchmark
Author
Hyderabad, First Published Jul 13, 2021, 4:25 PM IST

నేడు స్టాక్ మార్కెట్ రెండవ ట్రేడింగ్ రోజున మంగళవారం లాభాలతో ముగిసింది. ఉదయం ప్రారంభం నుండి కాస్త అస్థిరత తరువాత బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్  ప్రైమరీ ఇండెక్స్ సెన్సెక్స్ 397.04 పాయింట్లు (0.76 శాతం) పెరిగి 52,769.73 వద్ద ముగియగా మరోవైపు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 119.75 పాయింట్ల (0.76 శాతం) లాభంతో 15,812.35 వద్ద ముగిసింది.  

ఈ రోజు గ్రాసిమ్, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బిఐ లైఫ్ షేర్లు లాభాలతో ఉన్నాయి. మరోవైపు అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డి, హెచ్‌సిఎల్ టెక్, టాటా కన్స్యూమర్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాలతో ముగిశాయి. 

 ఈ రోజు ఎఫ్‌ఎంసిజి, ఐటి నష్టలతో ముగియగా మరోవైపు, మెటల్, ఫార్మా, రియాల్టీ, ఆటో, పిఎస్‌యు బ్యాంకులు, ఫైనాన్స్ సర్వీసెస్, బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు లాభాల  మీద క్లోజ్ అయ్యాయి.

 ఐటి మేజర్స్ ఇన్ఫోసిస్ ఆండ్ విప్రో గ్రాస్ ఆర్థిక డేటా, గ్లోబల్ ఇండికేటర్స్ త్రైమాసిక ఫలితాలు ఈ వారం స్టాక్ మార్కెట్ల దిశను నిర్ణయిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇన్ఫోసిస్ ఇంకా విప్రోలతో పాటు మైండ్‌ట్రీ, టాటా అలెక్సీ, హెచ్‌డిఎఫ్‌సి ఎఎమ్‌సి త్రైమాసిక ఫలితాలు ఈ వారంలో ప్రకటించనున్నారు.

also read మీడియా నివేదికలు "నిర్లక్ష్యం, బాధ్యతారహితమైనవి": మారిషస్ ఫండ్స్ పై అదానీ గ్రూప్ చీఫ్ క్లారీటి..

అంతే కాకుండా పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపి), రిటైల్ అండ్ టోకు ద్రవ్యోల్బణ డేటా కూడా వారంలో రాబోతున్నాయి. మరోవైపు పెట్టుబడిదారులు ముడి చమురు ధరలు, డాలర్‌కు వ్యతిరేకంగా రూపాయి అస్థిరత, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల పెట్టుబడి ధోరణిని కూడా పరిశీలిస్తారని విశ్లేషకులు తెలిపారు.

స్టాక్ మార్కెట్ ఉదయం ప్రారంభ సమయంలో సెన్సెక్స్ 235.39 పాయింట్లు (0.45 శాతం) పెరిగి 52608.08 స్థాయిలో ప్రారంభమైంది. నిఫ్టీ 73.90 పాయింట్లు (0.47 శాతం) పెరిగి 15766.50 స్థాయిలో ప్రారంభమైంది. 

 స్టాక్ మార్కెట్ సోమవారం ఫ్లాట్ స్థాయిలో ముగిసింది. రోజంతా అస్థిరత తరువాత సెన్సెక్స్ 13.50 పాయింట్లు (0.03 శాతం) తగ్గి 52,372.69 వద్ద ముగిసింది. మరోవైపు, నిఫ్టీ 2.80 పాయింట్లు (0.02 శాతం)తో  స్వల్ప లాభంతో 15,692.60 వద్ద ముగిసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios