Asianet News TeluguAsianet News Telugu

స్టాక్ మార్కెట్ల జోష్: నేడు లాభాలతో ప్రారంభమయిన సెన్సెక్స్, నిఫ్టీ

నేడు స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ 289.24 పాయింట్ల (0.59 శాతం) లాభంతో 49495.71 వద్ద ప్రారంభమైంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 98.80 పాయింట్ల పెరుగుదలతో 14922 వద్ద ప్రారంభమైంది,  
 

sensex nifty stock market : share market today on may 10th 2021 opening indian indices higher
Author
Hyderabad, First Published May 10, 2021, 10:38 AM IST

నేడు వారంలోని మొదటి ట్రేడింగ్ రోజున సోమవారం సానుకూల గ్లోబల్ సిగ్నల్స్ కారణంగా స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్  ప్రైమరీ ఇండెక్స్ సెన్సెక్స్ 289.24 పాయింట్ల (0.59 శాతం) లాభంతో 49495.71 వద్ద ప్రారంభమైంది.  

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 98.80 పాయింట్ల పెరుగుదలతో అంటే 0.67 శాతంతో 14922 వద్ద ప్రారంభమైంది. నేడు 1331 స్టాక్స్ లాభపడ్డాయి, 284 స్టాక్స్ క్షీణించగా, 77 స్టాక్స్  మారలేదు. గత వారం 30 షేర్ల బిఎస్ఇ సెన్సెక్స్ 424.11 అంటే 0.86 శాతం లాభపడింది. 

ఈ వారం స్టాక్ మార్కెట్ ఈ కారకాల ద్వారా నిర్ణయించబడుతుంది

కరోనా వైరస్ వ్యాప్తి, కంపెనీల ఆర్థిక ఫలితాలు, పారిశ్రామిక ఉత్పత్తితో సహా ఆర్థిక డేటా ఈ వారం స్టాక్ మార్కెట్ కదలికను నిర్ణయిస్తుంది. ఈ వారంలో ఒక సెలవు దినం కారణంగా, మార్కెట్ నాలుగు రోజులు మాత్రమే ట్రేడ్ అవుతుంది. అంతేకాకుండా ప్రపంచ ధోరణి, రూపాయి హెచ్చుతగ్గులు కూడా మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతాయి. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం మూసివేయబడుతుంది.

గత వారం టాప్ 10 సెన్సెక్స్ కంపెనీలలో ఎనిమిది లాభపడ్డాయి
దేశంలోని అత్యంత విలువైన 10 కంపెనీలలో ఎనిమిది మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారం రూ .81,250.83 కోట్లకు చేరింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) ఇందులో అత్యధిక లాభం పొందింది. గత వారం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇన్ఫోసిస్ మాత్రమే మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా నష్టపోయాయి.

also read చైనా కంపెనీ విచిత్ర విధానం.. ఆఫీసులో ఒకటి కంటే ఎక్కువసార్లు టాయిలెట్ కి వెళ్తే ఏం చేస్తారో తెలుసా ? ...

మ్యూచువల్ ఫండ్ యూనిట్లు ఏప్రిల్‌లో పెట్టుబడి 
మ్యూచువల్ ఫండ్ యూనిట్లు ఏప్రిల్‌లో రూ .5,526 కోట్ల షేర్లను పెట్టుబడి పెట్టాయి. మార్కెట్లో కొంత మెరుగుదల కనిపించిన తరువాత వారు వరుసగా రెండవ నెల స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టారు. ఇన్వెస్ట్ 19 వ్యవస్థాపకుడు అండ్ సిఇఒ (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) కౌష్లేంద్ర సింగ్ సెంగర్ మాట్లాడుతూ "చాలా ఆర్థిక సాంకేతిక సంస్థలు ఈ రంగంలోకి వస్తున్నాయి, అలాగే వినియోగదారుల సంఖ్యను కూడా పెంచింది. ఇలాంటి పరిస్థితిలో రాబోయే నెలల్లో మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడి మరింత పెరుగుతుంది. 

హెవీవెయిట్స్‌లో ఎక్కువ భాగం
ఈ రోజు ప్రారంభంలో డాక్టర్ రెడ్డి, ఒఎన్‌జిసి, ఎన్‌టిపిసి, టైటాన్, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్, ఐటిసి, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, ఎస్‌బిఐ, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌సిఎల్ టెక్ షేర్లు  లాభాలతో  ఓపెన్ అయ్యాయి. అలాగే బజాజ్ ఫైనాన్స్, మారుతి, ఇన్ఫోసిస్, నెస్లే ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాలతో  ప్రారంభమయ్యాయి. 

ప్రీ-ఓపెన్ సమయంలో  
సెన్సెక్స్ ఉదయం 9.03 గంటలకు ప్రీ-ఓపెన్ సమయంలో 320.16 పాయింట్లు (0.65 శాతం)పెరిగి  49526.63 వద్ద ఉంది. నిఫ్టీ 69.80 పాయింట్లు (0.47 శాతం) పెరిగి 14893.00 వద్ద ఉంది.

గత  ట్రేడింగ్ రోజు
 గతవారం ట్రేడింగ్ చివరి రోజున 338.14 పాయింట్ల (0.69 శాతం) లాభంతో 49287.90 వద్ద  స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది . 106.60 పాయింట్లతో అంటే 0.72 శాతం పెరుగుదలతో నిఫ్టీ 14831.40 వద్ద ప్రారంభమైంది. 

స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాలతో ముగిసింది 
స్టాక్ మార్కెట్ శుక్రవారం గ్రీన్ మార్క్ మీద ముగిసింది. సెన్సెక్స్ 256.71 పాయింట్లు అంటే 0.52 శాతం పెరిగి 49,206.47 వద్ద ముగిసింది. నిఫ్టీ 98.35 పాయింట్లు అంటే 0.67 శాతం లాభంతో 14,823.15 వద్ద ముగిసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios