Asianet News TeluguAsianet News Telugu

స్టాక్ మార్కెట్ క్రాష్: 604 పాయింట్ల పతనంతో మొదలైన సెన్సెక్స్, నిఫ్టీ 14500 కిందకి..

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్  ఇండెక్స్ సెన్సెక్స్  నేడు 48177.78 వద్ద నష్టలతో ప్రారంభమైంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 171.90 పాయింట్లు లేదా 1.17 శాతం క్షీణించి 14459.20 వద్ద ప్రారంభమైంది. 
 

sensex nifty stock market : share market today 3 may 2021 opening indian indices lower
Author
Hyderabad, First Published May 3, 2021, 10:55 AM IST

నేడు వారంలోని మొదటి ట్రేడింగ్ రోజున అంటే సోమవారం స్టాక్ మార్కెట్ నష్టాలతో  ప్రారంభమైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్  ప్రైమరీ ఇండెక్స్ సెన్సెక్స్ 48177.78 వద్ద 604.58 పాయింట్లు (1.24 శాతం) పడిపోయి నష్టలతో ప్రారంభమైంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 171.90 పాయింట్లు అంటే 1.17 శాతం క్షీణించి 14459.20 వద్ద ప్రారంభమైంది. నేడు 641 షేర్లు లాభపడ్డాయి, 826 స్టాక్స్ క్షీణించగా, 82 స్టాక్లలో ఎటువంటి మార్పు లేదు.   

గ్లోబల్ మార్కెట్లు కూడా పతనం    

గత శుక్రవారం యు.ఎస్ స్టాక్ మార్కెట్లు భారీ కూడా పతనంతో మూగిసాయి. డౌ జోన్స్ 185.51 పాయింట్లు తగ్గి 33,874.90 వద్ద 0.54 శాతం తగ్గింది. నాస్‌డాక్ 119.86 పాయింట్లు క్షీణించి 13,962.70 వద్ద 0.85 శాతం క్షీణించింది. ఫ్రాన్స్‌, జర్మనీలలో కూడా స్టాక్  మార్కెట్లు కూడా పతనంతో ముగిశాయి. ఆసియా స్టాక్ మార్కెట్ల గురించి మాట్లాడితే జపాన్ నిక్కీ ఇండెక్స్ 281 ​​పాయింట్లు తగ్గి 28,812 వద్ద ట్రేడవుతోంది. చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 28 పాయింట్లు క్షీణించి 3,446 కు చేరుకుంది. హాంకాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ ఇండెక్స్ 450 పాయింట్లు తగ్గి 28,225 వద్ద ట్రేడవుతోంది.


ఈ వారంలో దేశ స్టాక్ మార్కెట్ కోవిడ్ -19  పరిస్థితి, ఆర్థిక డేటా, కంపెనీల త్రైమాసిక ఫలితాలు వంటి అంశాలు స్టాక్ మార్కెట్ కదలికను నిర్ణయిస్తాయి అని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స్టాక్ మార్కెట్‌పై ఎటువంటి ప్రభావాన్ని చూపించవని, అయితే వారంలో కోవిడ్ -19 ఫ్రంట్‌లో జరిగిన పరిణామాలు, ఈ పరిస్థితిని ఎదుర్కోవటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యూహం మార్కెట్‌పై ప్రభావం చూపుతుందని వారు అభిప్రాయపడ్డారు.

టాప్ 10 కంపెనీలలో ఏడు 
దేశంలోని టాప్ 10 మార్కెట్ క్యాపిటలైజ్డ్ కంపెనీలలో ఏడు కంపెనీల మార్కెట్ క్యాప్ గత వారం 1,62,774.49 కోట్ల బలమైన వృద్ధిని నమోదు చేసింది. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, బజాజ్ ఫైనాన్స్ సహకారం అందించాయి. ఈ కాలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హిందుస్తాన్ యూనిలీవర్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ లాభపడ్డాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సిల మార్కెట్ క్యాపిటలైజేషన్ క్షీణించింది.

 హెవీవెయిట్ స్టాక్స్ 

నేడు ప్రారంభంలో ఒఎన్‌జిసి, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డి, బజాజ్ ఆటో, ఎం అండ్ ఎం, టెక్ మహీంద్రా షేర్లు లాభాలతో ప్రారంభం అయ్యాయి. మరోవైపు బజాజ్ ఫిన్ సర్వ్, మారుతి, రిలయన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎన్‌టిపిసి, ఐటిసి, పవర్ గ్రిడ్ షేర్లు రెడ్ మార్క్ మీద ప్రారంభమయ్యాయి. 

ప్రీ-ఓపెన్ సమయంలో 
స్టాక్ మార్కెట్  సెన్సెక్స్ ఉదయం 9.02 గంటలకు ప్రీ-ఓపెన్ సమయంలో 117.27 పాయింట్లు (0.24 శాతం) పడిపోయి 48665.09 వద్ద ఉంది. నిఫ్టీ 80.70 పాయింట్లు (0.55 శాతం) తగ్గి 14550.40 వద్ద ఉంది.

 గత వారం చివరి ట్రేడింగ్ రోజున కూడా స్టాక్ మార్కెట్ నష్టాలతో  మొదలైంది. ఉదయం 9.16 గంటలకు సెన్సెక్స్ 450 పాయింట్లు క్షీణించగా, నిఫ్టీ 126 పాయింట్లు పడిపోయింది. సెన్సెక్స్ 49309.64 స్థాయిలో, నిఫ్టీ 14768 స్థాయిలో ప్రారంభమైంది.

భారతదేశంలో కోవిడ్ -19  కేసులు వేగంగా పెరగడం, ఆసియా మార్కెట్లలో క్షీణత కారణంగా దేశీయ మార్కెట్ ప్రభావితమైంది. దీంతో స్టాక్ మార్కెట్ ఇండెక్స్ 1.98 శాతం తగ్గి 48,782.36 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ 263.80 పాయింట్లు తగ్గి 1.77 శాతం పడిపోయి 14,631.10 వద్ద ముగిసింది.

Follow Us:
Download App:
  • android
  • ios