Asianet News TeluguAsianet News Telugu

బ్లాక్ మండే: స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇదే అతి పెద్ద పతనం

స్టాక్ మార్కెట్‌లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం అంతర్గత ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 2412 పాయింట్లు నష్టపోయింది. మదుపర్లు రూ.6.8 లక్షల కోట్లు నష్టపోయారు. అంతర్జాతీయ పరిస్థితులు నెగెటివ్ గా ఉన్నాయి. కరోనా ప్లస్ యెస్ బ్యాంకులో పరిణామాలు దేశీయ స్టాక్ మార్కెట్లను దెబ్బ తీస్తున్నాయి.
 

Sensex crashes over 2,400 points amid corona virus scare: Nifty below 10350
Author
Hyderabad, First Published Mar 9, 2020, 3:34 PM IST

ముంబై: స్టాక్ మార్కెట్ల చరిత్రలో మరో ‘బ్లాక్’ మండే నమోదైంది. జాతీయ, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో సమయం గడుస్తున్న కొద్దీ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు అంతకంతకూ దిగజారాయి. మధ్యాహ్నం 1.25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 2,412 పాయింట్లు నష్టపోయి 35,260 వద్ద ట్రేడవుతున్నది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 643 పాయింట్లు దిగజారి 10,346 వద్ద కొనసాగుతోంది.

గత 16 సెషన్లలో 13 సెషన్లు మార్కెట్లు నష్టపోవడం గమనార్హం. ఈ ఒక్కరోజే దాదాపు రూ.6.8 లక్షల కోట్లకు పైగా మదుపర్ల  సంపద ఆవిరైపోయింది. మార్కెట్ల చరిత్రలో ఇదొక బ్లాక్‌ మండేగా మిగిలిపోనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

also read రాణా కపూర్ కూతురుకి షాక్... విమానం ఎక్కుతున్న ఆమెను...

అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తి మదుపర్లను తీవ్ర నిరాశలోకి నెట్టివేసింది. మరోవైపు ఇంధన ఉత్పత్తి విషయంలో రష్యా, ఒపెక్‌ మధ్య ఏర్పడ్డ భేదాభిప్రాయాలు సూచీల సెంటిమెంటును మరింత దిగజార్చాయి. దీంతో చమురు ఆధారిత సంస్థల షేర్లు భారీ నష్టాల్ని చవి చూస్తున్నాయి. 

యెస్‌ బ్యాంక్‌ సంక్షోభంలో సీబీఐ సోదాలు చేపట్టడం.. రూ.600 కోట్లు ముడుపులు అందాయని ఎఫ్ఐఆర్‌లో పేర్కొనడం వంటి పరిణామాలు దేశీయ మదుపర్లను నిరాశకు గురిచేశాయి. అంతకుముందు ఉదయం 12.21 సమయంలో సెన్సెక్స్‌ 1,573 పాయింట్లు నష్టపోయి 36,003 వద్ద, నిఫ్టీ 435 పాయింట్లు నష్టపోయి 10,554 వద్ద ట్రేడయ్యాయి. 

also read మరింత తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు...

బెంచ్‌మార్క్‌ సూచీలు దాదాపు 4శాతం వరకు విలువ కోల్పోయాయి. యెస్‌బ్యాంక్‌ వ్యవహారం దేశీయ బ్యాంకింగ్‌ రంగ షేర్లపై కూడా ప్రభావం చూపిస్తోంది. ఇక స్మాల్‌ క్యాప్‌ సూచీ 3.5శాతం, మిడ్‌క్యాప్‌ సూచీ 3.3శాతం నష్టపోయాయి. దీంతో బ్యాంకింగ్‌ రంగ షేర్లు సైతం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాలు చవి చూస్తున్నాయి. నాలుగు శాతం నష్టాలతో లోహరంగం అత్యధిక నష్టాల్ని మూటగట్టుకుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios