గుడ్‌న్యూస్: వడ్డీ రేట్లను పెంచిన ఎస్‌బీఐ

First Published 30, Jul 2018, 6:20 PM IST
SBI raises Fixed Deposit interest rates
Highlights

 ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీరేట్లపై ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ ఎస్‌బీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై  వడ్డీరేట్లను 10 బేసిన్ పాయింట్లవరకు పెంచింది. ఈ కొత్త రేట్లను జూలై 30వ తేదీ నుండి అమల్లోకి  వస్తాయని ఎస్‌బీఐ ప్రకటించింది.


ముంబై: ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీరేట్లపై ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ ఎస్‌బీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై  వడ్డీరేట్లను 10 బేసిన్ పాయింట్లవరకు పెంచింది. ఈ కొత్త రేట్లను జూలై 30వ తేదీ నుండి అమల్లోకి  వస్తాయని ఎస్‌బీఐ ప్రకటించింది.

జనరల్, సీనియర్ సిటిజన్ల కేటగీరీలు రెండింట్లలోనూ వివిధ మొత్తాలు, డిపాజిట్ల కాల వ్యవధులను బట్టి వడ్డీరేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. కోటి కంటే తక్కువ ఉన్న రిటైల్ డిపాజిట్లు ఏడాది నుండి పదేళ్ల కాల వ్యవధిలో ఉన్న వాటికి ఈ కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి.

ఏడాది నుండి రెండేళ్లవరకు ఉన్న డిపాజిట్లపై వడ్డీరేట్లు 6.65 శాతం నుండి 6.7శాతానికి పెరిగాయి.  సీనియర్ సిటిజన్లకు కొత్త రేటు 7.2 శాతంగా ఖరారు చేశారు. రెండేళ్ల నుండి మూడేళ్లవరకు ఉన్న డిపాజిట్లపై వడ్డీరేట్లను 7.15 శాతం నుండి 7.3 శాతం పెంచింది.
 
కొత్త వడ్డీరేట్లు కొత్త డిపాజిట్లతో పాటు రెన్యూవల్‌ డిపాజిట్లకు కూడ వర్తిస్తాయని ఎస్‌బీఐ ప్రకటించింది. గత జూన్‌ సమీక్షలో ఆర్‌బీఐ రేట్లను 0.25 శాతం పెంచిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణ భయాలతో వడ్డీరేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. అయితే ఈ సారి ఆర్‌బీఐ స్టేటస్‌ క్వోను పాటించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

loader