Asianet News TeluguAsianet News Telugu

బ్యాంక్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దీనివల్ల రూ.1000 కోట్లు ఆదా..

కరోనా నేపథ్యంలో ఎక్కడ నుంచైనా పని చేసేందుకు అనుమతి ఇస్తున్నట్లు భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) చైర్మన్ రజనీశ్ కుమార్ తెలిపారు. ఇందుకు కొత్త విధానాన్ని అమలులోకి తేనున్నామని చెప్పారు. దీనివల్ల బ్యాంకుకు రూ.1000 కోట్లు ఆదా అవుతుందని అంచనా వేశారు. 
 

sbi plans work from anywhere to bank employess to save rs 1000 cr
Author
Hyderabad, First Published Jul 15, 2020, 12:04 PM IST

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తన ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ పాలసీని త్వరలోనే తీసుకురాబోతోంది. ఈ పాలసీ ద్వారా ఉద్యోగులు ఏ ప్రాంతంలో నుంచైనా వర్క్ చేసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్‌‌కు దేశవ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు.

కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ఎస్బీఐ తన కస్టమర్ల ప్రయోజనార్థం కాంటాక్ట్ లెస్ డిజిటల్ బ్యాంకింగ్‌‌పై ఫోకస్ చేసింది. దీని కోసం చాలా కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. అంతర్జాతీయంగా అమలు అవుతున్న ఉన్నత విధానాలను అమలు చేయడంలో భాగంగా బ్యాంక్‌‌ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ (డబ్ల్యూఎఫ్‌‌ఏ) ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ను క్రియేట్ చేయనుందని రజనీశ్ కుమార్ తెలిపారు.

సిబ్బంది ఏ లొకేషన్‌‌ నుంచైనా ఉద్యోగులు పనిచేసేలా అవకాశం కల్పించబోతోందని ఎస్బీఐ 65వ వార్షిక సర్వసభ్య సమావేశం‌లో ఎస్‌‌బీఐ ఛైర్మన్ రజ్‌‌నీష్ కుమార్ చెప్పారు. దీంతో వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌ను ఉద్యోగులకు అందించనున్నట్టు తెలిపారు.

also read పెట్రోల్ కంటే డీజిల్ కాస్ట్లీ.. మరోసారి ఇంధన ధర పెంపు.. ...

వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ పాలసీ ద్వారా రూ. వెయ్యి కోట్ల వరకు ఆదా చేయొచ్చని రజ్‌‌నీష్ కుమార్ చెప్పారు. కరోనా టైమ్‌‌లో వ్యాపారాలను ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగించడానికి ఇది కీలక కాంపోనెంట్‌‌గా ఉన్నట్టు పేర్కొన్నారు. కరోనా మహమ్మారితో కాంటాక్ట్ లెస్ డిజిటల్ బ్యాంకింగ్‌‌ ఛానల్‌‌పై ఎక్కువగా ఫోకస్ చేసినట్టు తెలిపారు. 


ఎస్బీఐ యోనో ఇప్పటికే వాలెట్‌‌ షేర్ పెంచుకుని, తన డిజిటల్ ఛానల్ ద్వారా గణనీయమైన వృద్ధిని సాధించిందని రజనీశ్ కుమార్ చెప్పారు. యోనోను మరింత విస్తరించాలని ఎస్‌‌బీఐ ప్లాన్ చేస్తోంది. వచ్చే ఆరు నెలల్లో యూజర్ రిజిస్ట్రేషన్‌‌ను రెండింతలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఎండ్ టూ ఎండ్ హోమ్ లోన్స్ ఆఫర్, ప్రీ అప్రూవ్డ్ కారు లోన్, పర్సనల్ గోల్డ్ లోన్ వంటి కొత్త ప్రొడక్ట్ ఆఫర్ల ద్వారా మరింతగా ఈ యాప్‌‌ను బలోపేతం చేయాలని బ్యాంక్ చూస్తోంది. కస్టమర్ సౌకర్యార్థం ఎస్బీఐ యోనో యాప్‌‌లోనే కస్టమర్ సర్వీస్ పాయింట్ల వద్ద యుటిలిటీ బిల్లు చెల్లింపులు, ఏటీఎం కార్డులు అవసరం లేకుండానే యోనో యాప్ ద్వారా సీఎస్‌‌పీ ఔట్‌‌లెట్ ద్వారా క్యాష్ విత్‌‌డ్రాయల్ సౌకర్యం చేసుకోవచ్చునని తెలిపింది.

ఇంటి వద్దే క్యాష్ పికప్, క్యాష్ డెలివరీ, ఇంటి వద్దనే చెక్ పికప్ వంటి సౌకర్యాలను తెచ్చామని ఎస్బీఐ ఛైర్మన్ రజనీశ్ కుమార్ తెలిపారు. ఆస్తులు, డిపాజిట్లు, బ్రాంచ్‌‌లు, కస్టమర్లు, ఉద్యోగుల పరంగా ఎస్బీఐ దేశంలోనే అతిపెద్ద కమర్షియల్ బ్యాంక్‌గా నిలిచింది. భారత దేశంలో ఎస్బీఐకి 22 వేలకు పైగా శాఖలు సేవలందిస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios