న్యూ ఢీల్లీ: నాలుగు రోజుల విరామం తరువాత ఇంధన ధరల పెంపు నేపథ్యంలో దేశ రాజధానిలో డీజిల్ ధర ఆదివారం లీటరుకు 81 రూపాయలకు చేరుకుంది. ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు మార్కెటింగ్ సంస్థల ధర నోటిఫికేషన్ ప్రకారం ఆదివారం డీజిల్ ధర లీటరుకు 16 పైసలు పెంచారు.

దేశ రాజధానిలో రిటైల్ అమ్మకం ధర లీటరుకు 80.94 రూపాయలకు చేరుకుంది. ఇది ఇప్పటివరకు ఉన్న అత్యధికం. పెట్రోల్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేనప్పటికీ, డీజిల్‌పై 13 పైసలు పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.

దీంతో దేశరాజధాని ఢిల్లీలో లీటర్‌ డీజిల్‌ ధర ప్రస్తుతం రూ.81.18కి చేరింది. దాదాపు రెండు వారాలుగా పెట్రోల్ ధరలో ఎటువంటి మార్పు లేదు, ప్రస్తుత పెట్రోల్ ధర లీటరుకు 80.43 రూపాయలుగా కొనసాగుతోంది. స్థానిక అమ్మకపు పన్ను లేదా వ్యాట్ బట్టి రేట్లు ప్రతి రాష్ట్రానికి మారుతుంటాయి.

also read రిలయన్స్ జియోతో గూగుల్‌ భారీ డీల్..త్వరలో అధికారిక ప్రకటన.. ...

డీజిల్ ధరను చివరిగా జూలై 12న సవరించగా, పెట్రోల్ రేట్లు చివరిగా జూన్ 29న సవరించారు. గత ఐదు వారాల్లో డీజిల్ ధర 24 సార్లు పెరిగింది, పెట్రోల్ ధర 21సార్లు పెరిగింది. చమురు కంపెనీలు జూన్ 7న నుండి ఇంధన ధరల పెంపు ప్రారంభించినప్పటి నుండి పెరుగుదల మొత్తం పెట్రోల్‌ పై 9.17 రూపాయలు, డీజిల్‌పై 11.55 రూపాయలు పెరిగింది.

ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.87.19 గా ఉండగా  జూన్ 29 నుండి ఎలాంటి ఇంధన ధరల మార్పు లేదు, డీజిల్ ధర రూ.79.05 నుండి రూ .79.17 కు పెరిగింది.  హైదరబాద్ లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.83.49గా ఉండగా, డీజిల్ ధర రూ.79.14ఉంది. తాజా పెంపుతో దేశ రాజధానిలో పెట్రోల్‌ కంటే డీజిల్‌ ధరలే అధికంగా ఉంటున్నాయి.