భారత దేశ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్ల కోసం అదిరిపోయే సూపర్ ఆఫర్ ప్రకటించింది. ఎస్‌బీఐ ఏటీఎం కమ్ డెబిట్ కార్డులపై ప్రమోషనల్ ఆఫర్ ప్రవేశపెట్టింది. ఎస్‌బీఐ డెబిట్ కార్డు ఆఫర్‌  ఎస్‌బి‌ఐ యొక్క మాస్టర్ కార్డ్, డెబిట్ కార్డు ఉపయోగిస్తున్న కస్టమర్లందరికీ ఇది వర్తిస్తుంది.

also read  రెండో వివాహం చేసుకోబోతున్న ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడి కుమారుడు...

స్టేట్ బ్యాంక్ ఆఫర్‌లో భాగంగా కస్టమర్లకు ట్రాన్సాక్షన్ అమౌంట్‌పై 1 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అన్ని ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మెషీన్స్, ఇ-కామర్స్ ట్రాన్సాక్షన్లకు ఇది వర్తించనుంది. ఈ ఆఫర్ 2019 డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది.

ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ క్యాష్‌బ్యాక్ స్కీమ్ 18 ఏళ్లకు పైన వయసు కలిగిన వారందరికీ అందుబాటులో ఉంది. అయితే వీరి వద్ద వాలిడ్ ఎస్‌బీఐ మాస్టర్ కార్డ్ ఈఎంఐ చిప్ డెబిట్ కార్డు ఉండాలి. ఎస్‌బీఐ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు, ఎస్‌బీఐ ఏజెంట్స్ వంటి వారికి ఈ ప్రమోషనల్ ఆఫర్ వర్తించదు.

also read అంతర్జాతీయ విపణిలోకి భీమ్.. సింగపూర్‌‌‌‌లో ప్రారంభం...


స్టేట్ బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ విదేశాల్లో పీఓఎస్ మెషీన్లు, ఇతర కొనుగోళ్లకు మాత్రమే వర్తిస్తుంది. కార్పొరేట్ కార్డ్ కలిగిన వారికి ఈ ప్రమోషనల్ ఆఫర్ వర్తించదు. అలాగే మినిమమ్ ట్రాన్సాక్షన్ వ్యాల్యూ కూడా ఉంటుంది. దీనికి పైన చేసిన లావాదేవీలకు మాత్రమే క్యాష్‌బ్యాక్ వస్తుంది.ఒక శాతం క్యాష్‌బ్యాక్ పొందాలంటే ట్రాన్సాక్షన్ వ్యాల్యూ కనీసం 500 డాలర్లు ఉండాలి. అలాగే గరిష్టంగా ఒక కార్డుపై రూ.2,500 వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది.