ఇన్ఫోసిస్ సంస్థ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమారుడు రోహన్ మూర్తి త్వరలో అపర్ణ కృష్ణన్ ను వివాహం చేసుకోబోతున్నట్లు ఎకనామిక్ టైమ్స్ లో ఒక ప్రత్యేక నివేదిక తెలిపింది.ముప్పై ఆరేళ్ల రోహన్, అపర్ణ డిసెంబర్ 2 న బెంగళూరులో వివాహం చేసుకోబోతున్నట్లు తెలిపారు.

ఈ జంట ఒకరికొకరు సుమారు మూడు సంవత్సరాలుగా పరిచయం ఉందని మా ఇద్దరికీ  సన్నిహితుడైన ఒక స్నేహితుడి ద్వారా మేము కలుసుకున్నామని తెలిపారు. అపర్ణ తల్లి రిటైర్డ్ ఎస్బిఐ ఉద్యోగి సావిత్రి కృష్ణ, తండ్రి భారత నేవీలో పనిచేసిన కమాండర్ కె.ఆర్ కృష్ణన్ లకు అపర్ణ ఏకైక కుమార్తె. బెంగళూరు నివాసి అయిన ఆమె కెనడాలోని లెస్సర్ బి పియర్సన్ యునైటెడ్ వరల్డ్ కాలేజ్ ఆఫ్ ది పసిఫిక్ కు వెళ్లి, ఆపై డార్ట్మౌత్ కాలేజీ నుండి ఎకనామిక్స్ లో పట్టభద్రురాలైంది.

 also read  అంతర్జాతీయ విపణిలోకి భీమ్.. సింగపూర్‌‌‌‌లో ప్రారంభం...

ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పొలిటికల్ సైన్స్ కూడా అభ్యసించింది.ఆమె లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ప్రకారం, అపర్ణ గోల్డ్ మన్ సాచ్స్, మెక్ కిన్సే, సీక్వోయా క్యాపిటల్ లో పనిచేసింది. ఆమే ప్రస్తుతం రోహన్ 2014 లో స్థాపించిన కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ సంస్థ సోరోకోలో ఎంగేజ్‌మెంట్ మేనేజర్‌గా  ఏప్రిల్ 2017 నుండి  పనిచేస్తోంది.


రోహన్ హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి ‘ఆపర్చునిస్టిక్ వైర్‌లెస్ నెట్‌వర్క్ ఆర్కిటెక్చర్స్’ పై కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీని పూర్తి చేశాడు. సోరోకో అనే సంస్థను సొంతంగా  స్థాపించాడు అలాగే అతను మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడిగా కూడా ఉన్నాడు.

also read పన్ను రేట్ల...కోసం కసరత్తు: ఆదాయం పెంపునకు ‘నిర్మల’మ్మ స్ట్రాటర్జీ

రోహన్, అపర్ణల పెళ్లి  సన్నిహిత కుటుంబం, స్నేహితుల మధ్య సాధారణ వేడుకలో వివాహం చేసుకోనున్నారు. అనంతరం సాయంత్రం బెంగళూరులో వారి వివాహ రిసెప్షన్ ఉంటుంది.రోహన్ ఇంతకు ముందు టివిఎస్ గ్రూపు (సుందరం-క్లేటన్ గ్రూప్) కు చెందిన బిజినెస్ మొగల్స్ వేణు శ్రీనివాసన్, ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ చైర్‌పర్సన్ మరియు సిఇఒ మల్లికా శ్రీనివాసన్ కుమార్తె లక్ష్మి వేనుని వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ 2011 లో వివాహం చేసుకొని  2015 లో వారి వివాహాన్ని ముగించారు. ప్రస్తుతం లక్ష్మి వేణు సుందరం-క్లేటన్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా  పనిచేస్తున్నారు.