దేశంలోని అతిపెద్ద రుణ దాత బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బి‌ఐ) తన కస్టమర్ల కోసం  గుడ్ న్యూస్ అందించింది. అదేంటంటే ఏటీఎం సంబంధిత మోసాలు పెరిగిపోతుండటంతో కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఎస్‌బీఐ కొత్త సర్వీసుల్లో భాగంగా ఎస్‌బి‌ఐ బ్యాంక్ కస్టమర్ ఏటీఎంకు వెళ్లి బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం లేదా మిని స్టేట్‌మెంట్ చూసుకుంటే అప్పుడు సంబంధిత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. అప్పుడు బ్యాంక్ కస్టమర్లు అలెర్ట్ కావొచ్చు.

ఆ ట్రాన్సాక్షన్ చేసేది వారెనా లేకపోతే ఇంకెవరైనాన అనే అనుమానం వస్తే వెంటనే వారి అక్కౌంట్ డెబిట్ కార్డును బ్లాక్ చేసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ అధికారిక ట్విట్టర్ అక్కౌంట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇకపై బ్యాలెన్స్ ఎంక్వైరీ లేదా మిని స్టేట్‌మెంట్‌కు సంబంధించి ఏటీఎం నుంచి ఏదైనా రిక్వెస్ట్ వస్తే మేం వెంటనే మా కస్టమర్లలు ఎస్‌ఎం‌ఎస్ పంపించి అలర్ట్ చేస్తాం.

also read  జూమ్ యాప్ రికార్డు.. 24 గంటల్లోనే 4.2 బిలియన్ డాలర్లు.. ...

దీని వల్ల ఖాతాదారుల ఏటీఎం నుండి లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్ జరగకుండా డెబిట్ కార్డును బ్లాక్ చేసుకోవచ్చు అని ఎస్‌బీఐ ట్వీట్ చేసింది. ఆన్ లైన్ మోసగాళ్లు, సైబర్ క్రైమ్ దాడులు చేసే వారికి కూడా బ్యాంక్ అకౌంట్‌లో ఎంత డబ్బు ఉందో తెలుసుకునే అవకాశాలు ఉండొచ్చని స్టేట్ బ్యాంక్ తెలిపింది.

అందువల్ల ఖాతాదారులకు ఈ విషయం తెలిస్తే వెంటనే బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించిన డెబిట్ కార్డును బ్లాక్ చేసుకుంటారని పేర్కొంది. అంతే కాకుండా ఎస్‌బీఐ ఇంతకు ముందు కూడా ఏటీఎం మోసాలను నియంత్రించేందుకు పలు కీలక నిర్ణయాలను కూడా  తీసుకుంది.