జూమ్ యాప్ వీడియో కమ్యూనికేషన్స్ ఇంక్. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్  50 ఏళ్ల ఎరిక్ యువాన్ సంపద కొద్ది గంటల్లో 4.2 బిలియన్ డాలర్లు  పెరిగిందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. జూలై 31తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను ఆగస్టు 31న ప్రకటించారు.

దీంతో జూమ్ ఆదాయం గణనీయమైన పెరుగుదల, వృద్ధిని  కనబరిచింది.  జూమ్ ఆదాయం 355 శాతం పెరిగి 663.5 మిలియన్ డాలర్లకు చేరుకుంది. కేవలం ఒక సంవత్సరంలో ఆదాయం దాదాపు నాలుగు రెట్లు పెరుగుదలను నమోదు చేసింది.

వర్చువల్-మీటింగ్ కంపెనీ షేర్లు 26 శాతం ఎగిశాయి. మంగళవారం స్టాక్ లాభాలతో యువాన్ సంపద 20 బిలియన్ డాలర్లను అధిగమించింది.

also read రుణాల మార‌టోరియం మరో రెండేళ్ల వ‌ర‌కు పొడిగింపు..! : కేంద్రం ...

టెక్ ప్రపంచంలో అత్యంత ధనవంతుల పేర్ల జాబితాలో అమెజాన్.కామ్ ఇంక్ జెఫ్ బెజోస్ జూలైలో ఒక రోజులో అతని సంపద 13 బిలియన్ డాలర్లు పెరిగిందని, టెస్లా ఇంక్ సి‌ఈ‌ఓ ఎలోన్ మస్క్ గత నెలలో 24 గంటల్లో 8 బిలియన్ల డాలర్లకు పెరిగింది.

ఇద్దరూ రికార్డు స్థాయిలో సంపదను పొందారు, జెఫ్ బెజోస్ 200 బిలియన్ డాలర్లు, మస్క్ గత వారం 100 బిలియన్ డాలర్లను అధిగమించారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి సమయంలో లాభాలను పొందిన సంస్థలలో జూమ్ ఒకటి. వ్యాపారాలు రిమోట్గా పని చేయడానికి, విద్యాసంస్థలు కూడా రిమోట్గా బోధించడానికి జూమ్ సేవలను ఆశ్రయించాయి.

జనవరితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో జూమ్ ఆదాయం 2.39 బిలియన్ డాలర్లు పెరిగిందని జూమ్ తెలిపింది, అంటే కేవలం ఒక సంవత్సరంలో ఆదాయం దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. జూమ్ ప్రారంభ పెట్టుబడిదారులు లి కా-షింగ్, శామ్యూల్ చెన్ సంపద కూడా  పెరిగింది.