ముంబై: దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) జూన్ 10 నుండి అన్ని టెనర్‌లలో ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసిఎల్‌ఆర్) 7.25 శాతం నుంచి 7 శాతానికి అంటే 25 బేసిస్ పాయింట్లకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఎస్‌బిఐ బేస్ రేటును 75 బేసిస్ పాయింట్లు అంటే  8.15 శాతం నుంచి 7.40 శాతానికి తగ్గించింది.ఇది  జూన్ 10 నుంచి అమలులోకి రానున్నట్లు బ్యాంక్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. 

 ఒక సంవత్సర కాలపరిమితి కలిగిన ఎంసీఎల్‌ఆర్‌ రేటు 7.25 శాతం నుండి 7 శాతానికి సవరించింది. ఇది బ్యాంకు ఎంసీఎల్‌ఆర్‌ని తగ్గించడం వరుసగా ఇది 13వ సారి. బ్యాంక్‌ తీసుకున్న తాజా నిర్ణయంతో ఎంసీఎల్‌ఆర్‌తో అనుసంధానమైన 30 ఏండ్ల కాలపరిమితి కలిగిన రూ.25 లక్షల గృహ రుణంపై  ఈఎంఐ రూ.421 తగ్గనున్నది. అలాగే ఈబీఆర్‌/ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ కూడా రూ.660 తగ్గనున్నది.

also read ఇరగదీస్తున్న జియో: అబుదాబీ పెట్టుబడి.. 97 వేల కోట్లు దాటాయి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో పరపతి సమీక్షలో రిజర్వుబ్యాంక్‌ వడ్డీరేట్లను 40 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎస్‌బీఐ ఈబీఆర్‌, ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ని కోత విధించింది అని బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ ఎక్స్‌టర్నల్‌ బెంచ్మార్క్ లింక్డ్ లెండింగ్ రేట్ (ఇబిఆర్) తో పాటు రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్) ను జూలై 1 నుండి 40 బేసిస్ పాయింట్లకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.

ఇబిఆర్‌ను సంవత్సరానికి 7.05 శాతం నుంచి 6.65 శాతానికి తగ్గించగా, ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్ 6.65 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గించింది. మే 22 న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు తగ్గించిన తరువాత ఇబిఆర్, ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌లను ఎస్‌బి‌ఐ తగ్గించింది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బిఒఐ), యుకో బ్యాంక్ వంటి కొన్ని బ్యాంకులు రెపో రేటు, ఎంసిఎల్‌ఆర్ రేట్లతో అనుసంధానించిన రుణ రేట్లను ఇప్పటికే తగ్గించాయి.