దసరా, దీపావళి పండుగ సీజన్‌లో భాగంగా హోమ్‌బ్యూయర్‌లను ఆకర్షించే ప్రయత్నంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై 20 బేసిస్ పాయింట్లు లేదా 0.20 శాతం పాయింట్ల వరకు రాయితీని ప్రకటించింది.

ఈ రాయితీ పథకం 30 లక్షల నుండి  2 కోట్ల వరకు ఉన్న గృహాల రుణాలకు వర్తిస్తుంది. ప్రస్తుత పండుగ సీజన్ ఆఫర్‌లో ఎస్‌బి‌ఐ ఇచ్చే రాయితీని పొడిగించింది.ఎనిమిది మెట్రో నగరాల్లో 3 కోట్ల వరకు రుణాలు తీసుకునే వినియోగదారులకు కూడా ఈ రాయితీ వర్తిస్తుందని ఎస్‌బిఐ తెలిపింది.

ఈ రాయితీ పథకం కింద 75 లక్షలకు పైన గృహ రుణాలపై ఎస్‌బి‌ఐ 20 బేసిస్ పాయింట్లు (0.2 శాతం పాయింట్), యోనో యాప్ ద్వారా చేసిన దరఖాస్తులపై అదనంగా 5 బేసిస్ పాయింట్లను అందిస్తుంది. అందువల్ల మొబైల్ యాప్ ఉపయోగించి గృహ రుణల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 25 బేసిస్ పాయింట్ల రాయితీ లభిస్తుంది.

also read పండుగ సీజన్ కోసం రిలయన్స్ జ్యువల్స్ కొత్త కలెక్షన్స్.. మేకింగ్ ఛార్జీలపై ఫ్లాట్ డిస్కౌంట్ కూడా.. ...

మరో మాటలో చెప్పాలంటే, సిబిల్ స్కోరు వంటి అంశాలకు లోబడి మొబైల్ యాప్ యోనో ద్వారా 75 లక్షల కంటే ఎక్కువ గృహ రుణాలపై వర్తించే వడ్డీ రేటులో రుణగ్రహీతలు 25-బిపిఎస్ రాయితీని పొందుతారు. 30 లక్షల నుండి 75 లక్షల వరకు ఉన్న రుణాలపై, క్రెడిట్ స్కోరు ఆధారిత 10 బిపిఎస్‌ల వరకు రాయితీ ఇస్తామని ఎస్‌బిఐ తెలిపింది.

మహిళా హోమ్‌బ్యూయర్‌లకు 5 బిపిఎస్‌ల అదనపు రాయితీ లభిస్తుందని ఎస్‌బిఐ బ్యాంకు తెలిపింది.గృహ రుణాలపై ఎస్‌బిఐ వడ్డీ రేట్లు 30 లక్షల వరకు గృహ రుణాలపై 6.90 శాతం,  30 లక్షలకు పైబడితే 7 శాతం నుండి ప్రారంభమవుతాయి.

"ఈ పండుగ సీజన్లో గృహ రుణల వినియోగదారులకు అదనపు రాయితీలను ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాము. గృహ రుణాలపై ఎస్‌బి‌ఐ అతి తక్కువ వడ్డీతో గృహ కొనుగోలుదారులను వారి డ్రీమ్ హౌస్ ప్లాన్ చేయడానికి దోహదపడుతుందని, ప్రోత్సహిస్తుందని మేము నమ్ముతున్నాము "అని ఎస్‌బి‌ఐ మేనేజింగ్ డైరెక్టర్ (రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్) సి.ఎస్ సెట్టి అన్నారు.