ముంబై: మండుతున్న ఎండల్లో.. స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా తన కస్టమర్లకు చల్లని కబురు చెప్పింది. ఎస్బీఐ కార్డు ద్వారా ఏసీ(ఎయిర్ కండిషనర్స్)లు కొనుగోలు చేస్తే రూ. 1,500 క్యాష్‌బ్యాక్ అందిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ మే 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

రూ. 1500 చొప్పున క్యాష్‌బ్యాక్ పొందాలంటే 3 నెలలు, 6నెలలు లేదా 9 నెలలు ఈఎంఐలు తీసుకుంటే వర్తిస్తుంది. అంతేగాక, కనీస కొనుగోలు విలువ రూ. 20వేలు ఉండాలి. ఎంపిక చేసిన ఎలక్ట్రానిక్ షాపుల్లో మాత్రమే ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది.

లార్జ్ ఫార్మాట్ ఎలక్ట్రానిక్ చైన్, జనరల్ ట్రేడ్ మర్చంట్ ఔట్‌లెట్‌లలో లభిస్తుంది. అందుకే ముందే ఆ షాపుల్లో క్యాష్ బ్యాక్ వస్తుందా? లేదా? అనే విషయాన్ని కస్టమర్లు తెలుసుకోవాలని ఎస్బీఐ సూచించింది. 

ఈ క్యాష్ బ్యాక్ మొత్తం ఆగస్టు 30, 2019నాటికి వినియోగదారుల ఖాతాలో జమ అవుతుందని తెలిపింది. కాగా, ఛార్జ్ స్లిప్‌లో రూ. 1500 క్యాష్ బ్యాక్ అని ఖచ్చితంగా పేర్కొనాల్సి ఉంటుంది.