ముంబై: భారతీయ జాతీయ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) తన అంతర్జాతీయ రూపే (క్రెడిట్, డెబిట్) కార్డు వినియోగదారులకు తీపి కబురు అందించింది. ‘రూపే ట్రావెల్స్ టేల్స్’ పథకంలో భాగంగా విదేశాల్లో పర్యటించే వారికి పీఓఎస్ లావాదేవీలపై 40 శాతం ఆఫర్లను ప్రకటించింది. 

also read కార్పొరేట్ ప్రజాస్వామ్యానికి ముప్పు...సైరస్ మిస్త్రీ నియామకంపై టాటా సన్స్

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సింగపూర్, శ్రీలంక, బ్రిటన్, అమెరికా, స్పెయిన్, స్విట్జర్లాండ్, థాయిలాండ్ దేశాల్లో ఈ ఆఫర్లను వినియోగించు కోవచ్చునని తెలిపింది. విదేశీ పర్యటనలు చేసే వారిని డిజిటల్ పేమెంట్స్ దిశగా ప్రోత్సాహించే పద్దతిని తీసుకు వచ్చింది. 

ఈ ఆఫర్లతో కార్డు వినియోగదారులు న్యూ ఇయర్‌తోపాటు వేసవి సెలవుల పర్యటనల్లో చేసే షాపింగ్‌పై అందుబాటులోకి తెచ్చింది. క్యాష్ బ్యాక్‌తోపాటు మరింత ఎక్కువ నగదు ఆదా చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈ ఆఫర్ పొందడానికి వినియోగదారులు తమ రూపే కార్డును సంబంధిత బ్యాంకు, నెట్ వ్యాకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

also read కరెన్సీ నోట్లను గుర్తించడానికి ఆర్‌బి‌ఐ కొత్త యాప్...

రూపే కార్డు వినియోగదారులు ఈ ఆఫర్లు పొందాలంటే కనిష్టంగా రూ.1000 విలువైన వస్తువుల కొనుగోలు చేయాలి. క్యాష్ బ్యాక్ ఆఫర్ రూ.4000 వరకు గరిష్ఠంగా లభిస్తుంది. నెలలో నాలుగు సార్లు ఈ ఆఫర్లు పొందడం ద్వారా దాదాపు రూ.16 వేల వరకు పొదుపు చేసుకోవచ్చు. ఒకటి కన్నా ఎక్కువ కార్డులు ఉంటే మరింత లబ్ది పొందవచ్చు. 

ఈ సందర్భంగా ఎన్పీసీఐ సీఓఓ ప్రవీణ్ రాయ్ మాట్లాడుతూ రూపే ట్రావెల్ టేల్స్ పథకం కింద గ్లోబల్ ఆపర్లు ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉన్నదని చెప్పారు. దీని ద్వారా వినియోగదారులు నగదు క్యాష్ బ్యాక్ ఆపర్లు పొందొచ్చని చెప్పారు. అదనంగా దేశీయ, అంతర్జాతీయంగా విమానాశ్రయాల్లోని లాంజ్ ల్లో అనుమతి పొందొచ్చు. థామస్ కుక్, మేక్ మై ట్రిప్ వంటి సైట్లలో విమానాల బుకింగ్స్ పై ఆకర్షణీయ ఆపర్లు పొందొచ్చని చెప్పారు.