కరెన్సీ నోట్లను గుర్తించడానికి ఆర్‌బి‌ఐ కొత్త యాప్...

దృష్టి లోపం గల వారు కరెన్సీ నోటును గుర్తించడం కోసం భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఒక యాప్ ఆవిష్కరించింది. నోటు స్కాన్ చేస్తే దాని పూర్వా పరాలపై ఆడియో వినిపిస్తుంది.

RBI launches mobile app for visually challenged people  to identify currency notes

ముంబై: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) సరికొత్త మొబైల్ యాప్‌ను ఆవిష్కరించింది. దృష్టి సరిగ్గాలేని వారు కొత్త కరెన్సీ నోట్లు గుర్తించడానికి వీలుగా  ‘మనీ’ పేరుతో ఈ మొబైల్ అప్లికేషన్‌ తెచ్చింది.  ఈ యాప్‌ను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రారంభించారు. 

also read ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్​... అందరి చూపు దానిపైనే

ఈ యాప్‌ను ఐఓఎస్ ఆపిల్ ప్లే స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ వంటి వాటి నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు దీనిని ఉచిత డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అందుబాటులో ఉంది. ఆఫ్‌లైన్‌లో కూడా పని చేస్తుంది.మీకు మనీ యాప్ కావాలంటే యాప్ స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి మణి’ అని టైప్ చేయండి.

RBI launches mobile app for visually challenged people  to identify currency notes

ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫైయర్ అప్లికేషన్‌ యాక్స్‌స్‌ చేసి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ యాప్‌ను ఓసారి డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత ఆన్‌లైన్‌లో లేకపోయినా అంటే ఆఫ్‌లైన్‌లో ఉన్నా కూడా పని చేస్తుంది.   వినియోగదారులు ‘మనీ’ యాప్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత, మొబైల్ కెమెరాను ఉపయోగించి కరెన్సీ నోట్‌ను స్కాన్ చేస్తే,  హిందీ, ఆంగ్ల భాషల్లో నోట్ విలువ ఆడియో వినిపిస్తుంది. అయితే మనీ యాప్‌ నకిలీ నోట్లను గుర్తించలేదని ఆర్బీఐ స్పష్టం చేసింది.

also read కొత్త ఏడాదిలో భారీగా ఉద్యోగ అవకాశాలు....

కాగా 2016 నవంబర్‌లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత ఆర్బీఐ 'మహాత్మా గాంధీ సిరీస్' కింద కొత్త కరెన్సీ నోట్లను విడుదల చేసింది. రంగు, డిజైన్, పరిమాణాలలో గణనీయమైన మార్పులతో కొత్త కరెన్సీ నోట్లు రూ.2000, రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.20  రూ.10 నోట్లు తెచ్చిన సంగతి తెలిసిందే. వీటిని గుర్తించడంలో అంధులు పలు సమస్యలను ఎదుర్కొన్న నేపథ్యంలో తాజాగా ఈ యాప్‌ను తెచ్చింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios