గత కొన్ని రోజులుగా ముడి చమురు బ్యారెల్‌కు 100 డాలర్లుగా ఉంది. ముడి చమురు ధరలో నిరంతరం తగ్గుదల ఉంటే, అప్పుడు జాతీయ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ చౌకగా ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ప్రభుత్వ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ కొత్త ధరలను నేడు విడుదల చేశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధర పతనం కావడంతో దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరింత తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. అయితే రెండు నెలలకు పైగా జాతీయ మార్కెట్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి.

 గత కొన్ని రోజులుగా ముడి చమురు బ్యారెల్‌కు 100 డాలర్లుగా ఉంది. ముడి చమురు ధరలో నిరంతరం తగ్గుదల ఉంటే, అప్పుడు జాతీయ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ చౌకగా ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఇండియన్ పెట్రోలియం మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తాజా అప్‌డేట్ ప్రకారం ఈరోజు (శనివారం) జూలై 23న కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దాదాపు రెండు నెలలుగా జాతీయ స్థాయిలో పెట్రోలు, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.

IOCL ప్రకారం పెట్రోల్ డీజిల్
ఢిల్లీ 96.72 89.62 
ముంబై 106.31 94.27 
కోల్‌కతా 106.03 92.76 
చెన్నై 102.63 94.24 
హైదరాబాద్‌ 109.66 97.82

క్రూడ్ ఆయిల్ ధరలు
WTI క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 96.44 డాలర్లకు చేరుకున్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 104.1 డాలర్లుగా కనిపించింది. 

ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు విడుదలవుతాయి. ఆ తర్వాత ఉదయం 6 గంటల నుంచి కొత్త రేట్లు వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ ఇతర జోడించడం వల్ల దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది.

పెట్రోల్ డీజిల్ ధరలను ఎలా తెలుసుకోవచ్చు
చమురు మార్కెటింగ్ కంపెనీ HPCL, BPCL, IOC ఉదయం 6 గంటలకు కొత్త ధరలను విడుదల చేస్తాయి. మీరు కంపెనీ వెబ్‌సైట్ associates.indianoil.co.in/PumpLocator/ అండ్ SMS ద్వారా మీ నగరంలో పెట్రోల్, డీజిల్ తాజా ధరలను చెక్ చేయవచ్చు. ఇంట్లో కూర్చొని పెట్రోల్, డీజిల్ ధరలను SMS ద్వారా తెలుసుకోవడానికి మీరు మీ మొబైల్‌లో RSP <డీలర్ కోడ్> అని టైప్ చేసి 9224992249కి మెసేజ్ చేయాలి. ఒక్కో నగరానికి ఒక్కో కోడ్ ఉంటుంది. సిటీ కోడ్‌లను తెలుసుకోవడానికి మీరు ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్‌ చూడవచ్చు. రాష్ట్ర స్థాయిలో పెట్రోల్‌పై విధించే పన్ను కారణంగా వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా వేర్వేరుగా ఉంటాయి.