న్యూ ఢీల్లీ: ఆసియా అత్యంత సంపన్నుడు ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఎక్సాన్ మొబిల్ కార్ప్‌ను వెనక్కి నెట్టేసి  సౌదీ అరామ్‌కో తరువాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఇంధన సంస్థగా అవతరించింది.

అతిపెద్ద రిఫైనరీ రిలయన్స్ శుక్రవారం 4.3 శాతం లాభపడి 8 బిలియన్ డాలర్లను కంపెనీ ఖాతాలో వేసుకుంది. సంస్థ మార్కెట్ విలువ 189 బిలియన్ డాలర్లకు చేరుకోగా, ఎక్సాన్ మొబిల్ 1 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.

also read మాజీ ఉద్యోగి ఫిర్యాదుతో అలీబాబా గ్రూప్ ఫౌండర్ జాక్ మాకు కోర్టు సమన్లు ...

ఈ సంవత్సరం రిలయన్స్ షేర్లు 43% పెరిగాయి.  1.76 ట్రిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తో అరాంకో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంధన సంస్థగా కొనసాగుతుంది. ఈ సంవత్సరం ముకేష్ అంబానీ సంపద 22.3 బిలియన్లు పెరగడానికి ఇది సహాయపడింది, బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ లో ఐదవ స్థానానికి చేరుకుంది.

డిజిట‌ల్ రంగంలోనూ దూసుకు వెళ్తున్న రిల‌య‌న్స్‌లోకి పెట్టుబుడుల వ‌ర్షం కురుస్తున్న‌ది. ఎక్సాన్‌మోబిల్ సంస్థ ఇటీవ‌ల బిలియ‌న్ డాల‌ర్లు న‌ష్ట‌పోయింది.  రిల‌య‌న్స్ షేర్లు కూడా ఈ ఏడాది 43 శాతం దూసుకువెళ్లాయి. మ‌రో వైపు ఎక్సాన్ మోబిల్ షేర్లు 39 శాతం ప‌డిపోయాయి.