గురుగ్రామ్‌లోని జిల్లా కోర్టు చైనాకు చెందిన ఈ-కామర్స్ సంస్థ అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మాకు సమన్లు జారీ చేసింది. భారతదేశంలో అలీబాబా గ్రూప్ మాజీ ఉద్యోగి కంపెనీ యాప్‌లలో కంటెంట్ సెన్సార్‌షిప్, ఫెక్ వార్తలపై అభ్యంతరం వ్యక్తం చేసిన తరువాత తనను తప్పుగా సంస్థ నుండి తొలగించారని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

యుసి న్యూస్, యుసి బ్రౌజర్ తో సహ 57 ఇతర చైనీస్ యాప్స్ పై భద్రతా సమస్యల కారణంగా భారతదేశం నిషేధించిన కొన్ని వారాల తరువాత ఈ పిటిషన్ దాఖలైంది.

అలీబాబా గ్రూప్ యుసి వెబ్ మాజీ ఉద్యోగి పుష్పంద్ర సింగ్ పర్మార్ చైనాకు అనుకూలంగా భావించే కంటెంట్‌ను సెన్సార్ చేస్తోందని, దాని యాప్స్ యుసి బ్రౌజర్, యుసి న్యూస్ "సామాజిక, రాజకీయ గందరగోళానికి కారణమయ్యే" తప్పుడు వార్తలను ప్రదర్శించాయని జూలై 20న కోర్టులో దాఖలైన పిటిషన్ లో ఆరోపించారు.

also read హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో షేర్లను విక్రయించిన ఆదిత్య పూరి ...

అక్టోబర్ 2017 వరకు గురుగ్రామ్‌లోని యుసి వెబ్ కార్యాలయంలో అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు. దీనిపై గురుగ్రామ్ కోర్టు నోటీసులు జారీ చేసింది.2000 నోట్లు రద్దు, భారత్-పాక్ మధ్య యుద్ధం తప్పు అంటూ ఫేక్ న్యూస్ ను యూసీ న్యూస్ పబ్లిష్ చేసిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇండియా-చైనా సరిహద్దుకు సంబంధించిన వార్తలను కూడా సెన్సార్ చేసిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గురుగ్రామ్ జిల్లా కోర్టు సివిల్ జడ్జి సోనియా షికండ్ నోటీసులు జారీ చేశారు. జులై 29వ తేదీన అలీబాబా జాక్ మా సహా కంపెనీకి చెందిన పన్నెండుమంది అధికారులు కోర్టుకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు.

నెల రోజుల్లో రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ మేరకు జులై 20న సమన్లు జారీ అయ్యాయి.