Asianet News TeluguAsianet News Telugu

ఆ ఎస్టేట్.. ఇల్లు కోసం కొనలేదు : అంబానీ ఫ్యామిలీ లండన్‌కు షిఫ్టవ్వడంపై రిలయన్స్ క్లారిటీ

కార్పోరేట్ దిగ్గజం ముఖేశ్ అంబానీ లండన్‌లోని స్టోక్ పార్క్‌లో నివాసం ఉండనున్నట్లు ఒక వార్తాపత్రికలో ఇటీవలి సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ విషయంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ క్లారిటీ ఇచ్చింది. 

Reliance clarifies on report of Mukesh Ambani family moving to London
Author
Mumbai, First Published Nov 5, 2021, 10:25 PM IST

భారత కార్పొరేట్‌ దిగ్గజం రియలన్స్‌ అధినేత (Reliance Industries) ముకేశ్‌ అంబానీ (mukesh ambani) గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశవ్యాప్తంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన ముకేశ్‌ లక్షల కోట్లకు అధిపతిగా మారారు. అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో (billionaires list) ముకేశ్‌ 11వ స్థానంలో నిలిచారు. ఆయ‌న వ్య‌క్తిగ‌త నిక‌ర సంప‌ద రూ.7 ల‌క్ష‌ల కోట్ల‌పై చిలుకే. ఈ కారణంగానే అంబానీలకు సంబంధించిన వార్తల పట్ల సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఆసక్తి కనబరుస్తూ వుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ముకేశ్‌ కుటుంబానికి సంబంధించ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

ముకేశ్‌ అంబానీ కుటుంబం కొన్ని రోజుల్లో భారత్ నుంచి పూర్తిగా లండన్‌‌కు మకాం మార్చనుందన్నది సదరు వార్త సారాంశం. ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనం ప్రకారం ముకేశ్‌ అంబానీ లండన్‌లో ఓ విలాసవంతమైన ఇంటిని నిర్మించుకున్నారని, త్వరలోనే వీరి ఫ్యామిలీ లండన్‌లో (London) సెటిల్‌ కానున్నారని కథనం వచ్చింది. ఇక ఇంటి నిర్మాణం ఇలా వుంటుంది, ఇంటీరియర్ ఇలా వుంటుంది అంటూ రకరాల కథనాలు చక్కర్లు కొట్టాయి. ఇంత ప్రచారం జరుగుతున్నా అటు ముకేశ్‌ అంబానీ గానీ, రిలయన్స్ గానీ ఖండించలేదు. దీంతో ఈ వార్తలు నిజమంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రిలయన్స్‌ రంగంలోకి దిగింది. ముకేశ్‌ అంబానీ లండన్‌కు వెళ్లనున్నారనే వార్తలపై మీడియాకు అధికారికంగా క్లారిటీ ఇచ్చింది. 

ALso Read:ముకేష్ అంబానీ దీపావళి గిఫ్ట్.. కేవలం నెలకు రూ.300తో జియో ఫోన్ నెక్స్ట్..

‘ ముఖేష్ అంబానీ కుటుంబం లండన్‌కు షిప్ట్‌ కానున్నట్లు గతకొన్ని రోజులుగా నిరాధారనమైన వార్తలు ప్రచురితమవుతున్నాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఈ వార్తపై స్పష్టతనిచ్చేందుకు ఈ ప్రకటనను విడుదల చేసింది. అంబానీ ఫ్యామిలీ లండన్‌కే కాదు మరెక్కడకు వెళ్లడం లేదు. అయితే రిలయన్స్‌ ఇండస్ట్రీ లండన్‌లోని స్టోక్‌ పార్క్ ఎస్టేట్‌ను (stoke park estate) కొనుగోలు చేసిన విషయం నిజమే. అయితే ఈ ఎస్టేట్‌ను ప్రీమియర్‌ గోల్ఫింగ్‌ క్లబ్‌తో పాటు క్రీడా రిసార్ట్‌గా మార్చాలనే ఉద్దేశంతోనే కొనుగోలు చేశామని రిలయన్స్ సంస్థ క్లారిటీ ఇచ్చింది. లండన్‌లోని ఈ ప్రఖ్యాత ఎస్టేట్‌ కొనుగోలు వల్ల భారతదేశానికి మాత్రమే సొంతమైన ఆథిత్య రంగాన్ని (indian hospitality industry)  ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేయాలనే లక్ష్యంతోనే ఎస్టేట్‌ను కొనుగోలు చేసినట్లు రిలయన్స్‌ ప్రకటించింది. లండన్‌లోని బకింగ్‌ హామ్‌లో గల స్టోక్‌ పార్క్‌లో 300 ఎకరాల స్థలాన్ని ముఖేశ్ అంబానీ కొనుగోలు చేశారు. 300 ఎకరాల స్థలంలో 49 బెడ్‌ రూమ్‌లు ఉన్న ఇంటిని ప్రత్యేకంగా అంబానీ రూ.592 కోట్లతో  సొంతం చేసుకున్నట్లు కథనాల సారాంశం. 

ముంబైలోని ఆల్టామౌంట్ రోడ్డులో నాలుగు ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో గ‌ల విలాస‌వంత‌మైన (mukesh ambani antilia) ఇంటికి ముకేశ్ అంబానీ.. అంటిల్లా అని నామ‌క‌ర‌ణం చేశారు. క‌రోనా లాక్‌డౌన్ వేళ ఆయ‌న కుటుంబం గుజ‌రాత్‌లోని జామ్‌న‌గ‌ర్‌లోనే (reliance jamnagar refinery ) గ‌డిపింది. ఇదే జామ్‌న‌గ‌ర్‌లో ప్ర‌పంచంలోకెల్లా అతిపెద్ద పెట్రోకెమిక‌ల్ రిఫైన‌రీ ఫ్యాక్ట‌రీని రిల‌య‌న్స్ న‌డుపుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios