ఇకపై పర్సనల్ లోన్లు తీసుకోవడం కష్టమేనా? RBI కొత్త రూల్స్ అలా ఉన్నాయి మరి..
మీకు పర్సనల్ లోన్ కావాలా? అయితే ఇప్పుడు తీసుకోవడం కాస్త కష్టమే. కొత్త సంవత్సరం నుండి రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనలు అలా ఉన్నాయి మరి.. పర్సనల్ లోన్ రూల్స్ ఇప్పుడు మరింత కఠినంగా మార్చారు. ఆ స్ట్రిక్ట్ రూల్స్ గురించి వివరాలు ఇవిగో.
పర్సనల్ లోన్ కావాలా అని ఫోన్ కాల్స్ తరచుగా వస్తూనే ఉంటాయి కదా. మీరు వెంటనే లోన్ పొందాలంటే ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదని, వెంటనే డబ్బు అకౌంట్ లోకి వచ్చేస్తుందని చెబుతారు. మీరు కేవలం నెలవారీ EMI చెల్లిస్తే సరిపోతుంది అంటారు కదా. ఇప్పటి వరకు పర్సనల్ లోన్ సింపుల్ గానే లభించేది. ఎందుకంటే పర్సనల్ లోన్ ఇతర అన్ని రకాల లోన్ల కంటే సులభంగా పొందవచ్చు. ఇతర లోన్లకు చాలా డాక్యుమెంట్స్ అవసరం. కానీ పర్సనల్ లోన్, ఖాతాదారుడి జీతం, లావాదేవీలు, సిబిల్ స్కోర్ వంటి వాటి ఆధారంగా పొందవచ్చు.
పర్సనల్ లోన్ రూల్స్ కఠినతరం
ఒక బ్యాంక్ లో లోన్ తీసుకున్న తర్వాత అత్యవసరమైతే మరో బ్యాంక్ లో కూడా లోన్ తీసుకోవచ్చు. కానీ కొత్త సంవత్సరం నుండి రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు మార్చింది. ముఖ్యంగా పర్సనల్ లోన్ రూల్స్ కఠినతరం చేసింది.
పర్సనల్ లోన్ రూల్స్ లో ఉన్న చిన్న చిన్న లూప్ హోల్స్ ని ఉపయోగించుకొని చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారు. దీనివల్ల ఎక్కువ లోన్ తీసుకొని దివాళా తీసి లోన్ చెల్లించలేక ఇబ్బందుల్లో పడుతున్నారు. అందుకే రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు కొత్త రూల్స్ అమలు చేసింది. కొత్త రూల్స్ లో పర్సనల్ లోన్ కు కళ్ళెం వేసింది.
RBI కొత్త రూల్స్ ఇవే..
RBI కొత్త రూల్స్ ప్రకారం లోన్ ఇచ్చే బ్యాంకులు లేదా సంస్థలు, లోన్ తీసుకున్న వ్యక్తి వివరాలు, లోన్ అమౌంట్, సిబిల్ స్కోర్ వంటి అన్ని వివరాలను 15 రోజుల్లోపు అప్డేట్ చేయాలి. ఇప్పటివరకు 30 రోజుల గడువు ఉండేది. కానీ ఇప్పుడు 15 రోజులకు తగ్గించారు. దీనివల్ల ఒకేసారి వివిధ బ్యాంకుల్లో పర్సనల్ లోన్ తీసుకోవడం ఆగిపోతుందని RBI చెప్పింది.
ఇప్పటివరకు లోన్ తీసుకున్న 40 రోజుల తర్వాతే మరో లోన్ ఇచ్చే బ్యాంక్ కు ఈ సమాచారం అందుతుండేది. దీనివల్ల చాలా మంది ఒక బ్యాంక్ లో పర్సనల్ లోన్ తీసుకొని, మరో బ్యాంక్ లో కూడా అప్లై చేసి లోన్ తీసుకుంటున్నారు. దీన్ని అడ్డుకోవడానికే RBI కొత్త రూల్స్ అమలు చేసింది. ఒక పర్సనల్ లోన్ తీసుకున్న తర్వాత వేరే ఏ బ్యాంక్ లోనూ అదే వ్యక్తికి, అదే సమయంలో పర్సనల్ లోన్ రాదు. ఒక పర్సనల్ లోన్ బకాయి ఉన్నప్పుడు మరో పర్సనల్ లోన్ తీసుకోలేరు. ఈ కఠినమైన నిబంధన వల్ల వ్యక్తులపై అప్పుల భారం తగ్గుతుందని RBI భావిస్తోంది.
హోమ్, వెహికల్ లోన్లు తీసుకోవచ్చా
ఆర్బీఐ రూల్స్ మార్చిన నేపథ్యంలో పర్సనల్ లోన్ తీసుకున్న తర్వాత హోమ్ లోన్, వెహికల్ లోన్ వంటి ఇతర లోన్లు తీసుకోవచ్చా అనే ప్రశ్న తలెత్తుతుంది. దీనికి కూడా RBI సమాధానం ఇచ్చింది. పర్సనల్ లోన్ తీసుకున్న తర్వాత కార్ లోన్ లేదా మరేదైనా లోన్ తీసుకోవచ్చని స్పష్టం చేసింది. కానీ లోన్ తీసుకునే వ్యక్తి ఆదాయం, తీసుకున్న లోన్ కు చెల్లించే EMI వంటి లోన్ తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది.
ఏ బ్యాంకులోనైనా లోన్ తీసుకున్నప్పుడు వారి వివరాలు వెంటనే అప్డేట్ చేయాలి. దీనివల్ల వేరే బ్యాంకులకు లోన్ అప్లికేషన్ వస్తే, పూర్తి సమాచారం అందుతుంది. దీనివల్ల లోన్ ఇవ్వొచ్చా వద్దా అనే నిర్ణయం ఆ బ్యాంకులు స్వతంత్ర నిర్ణయం తీసుకుంటాయని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.
ఇది కూడా చదవండి: మీరు డబ్బు దాచుకోవాలంటే ఇవే బెస్ట్ సేవింగ్స్ స్కీమ్స్