MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • మీరు డబ్బు దాచుకోవాలంటే ఇవే బెస్ట్ సేవింగ్స్ స్కీమ్స్

మీరు డబ్బు దాచుకోవాలంటే ఇవే బెస్ట్ సేవింగ్స్ స్కీమ్స్

ప్రభుత్వాలు అందించే సేవింగ్స్ స్కీమ్స్ లో చేరాలని ఆలోచిస్తున్నారా? మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వం పోస్ట్ ఆఫీసులు, బ్యాంకుల ద్వారా అందించే చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను సవరిస్తుంది. అందువల్ల ప్రస్తుతం ఏ సేవింగ్స్ స్కీమ్స్ లో చేరితే అధిక లాభాలు వస్తాయో ఇక్కడ తెలుసుకొని డబ్బులు దాచుకోవడం మంచిది. ప్రభుత్వం అందిస్తున్న బెస్ట్ స్కీమ్స్ గురించి ఇక్కడ వివరాలు ఉన్నాయి. ఓ సారి పరిశీలించండి. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Jan 03 2025, 08:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

డబ్బు ఆదా చేయడానికి ప్రభుత్వ పొదుపు పథకాలు చాలా సురక్షితమైనవి. ఈ పథకాలు వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబాలకు కూడా ఆర్థిక భద్రతను అందిస్తాయి. మీరు సంపాదించే డబ్బును సేవింగ్స్ అకౌంట్స్ లో ఉంచితే సాధారణ వడ్డీ మాత్రమే వస్తుంది. అదే చిన్న మొత్తాల పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మీ డబ్బును పెంచుకోవచ్చు.

డిసెంబర్ 31న ఆర్థిక మంత్రిత్వ శాఖ PPF, NSC, KVP వడ్డీ రేట్లను సవరించింది. గత నాలుగు త్రైమాసికాలుగా వడ్డీ రేటు మారలేదు. ప్రస్తుతం మీరు సేవింగ్స్ చేయడానికి బెస్ట్ స్కీమ్స్ ఏమున్నాయో తెలుసుకుందాం రండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

2025లో PPF, NSC, సుకన్య సమృద్ధి యోజన వంటి పొదుపు పథకాలు మీ డబ్బు దాచుకోవడానికి బెస్ట్ ఆప్షన్స్. వీటి వడ్డీ రేట్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి. 

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ రేటును అందిస్తుంది. 5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ కు మంచి రిటర్న్స్ వస్తాయి. SCSSలో డిపాజిట్లు చేయడం వల్ల ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలు లభిస్తాయి.

 

35

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు (NSC) 5 సంవత్సరాలకు స్థిర వడ్డీ రేటును అందిస్తాయి. NSC అకౌంట్స్ సాధారణంగా నాలుగు రకాలుగా అందుబాటులో ఉన్నాయి. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలకు మీరు సేవింగ్స్ చేయొచ్చు. వీటిలో 5 సంవత్సరాలకు మీరు పెట్టే డబ్బుకు స్థిర వడ్డీ రేటును అందిస్తాయి.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పథకం 15 సంవత్సరాల మెచ్యూరిటీ కాలం కలిగి ఉంటుంది. పన్ను ప్రయోజనాలతో కూడిన దీర్ఘకాలిక పొదుపు పథకం కావున మీ డబ్బుకు మంచి లాభాలు వస్తాయి. 

45

సుకన్య సమృద్ధి యోజన (SSY) అనేది ఆడపిల్లల కోసం ఒక మంచి పొదుపు పథకం. ఇది పన్ను ప్రయోజనాలు అందించడంతో పాటు అధిక వడ్డీ రేటును అందిస్తుంది. సుకన్య సమృద్ధి యోజన అనేది మహిళలకు లేదా బాలికల కోసం ఒకేసారి పెట్టుబడి పెట్టే చిన్న మొత్తాల పొదుపు పథకం. ఇందులో మధ్యలోనే డబ్బు వెనక్కు తీసుకున్నా స్థిరమైన వడ్డీ రేటు లభిస్తుంది.

55

కిసాన్ వికాస్ పత్ర (KVP) ఒక నిర్ణీత కాలంలో మీ పెట్టుబడిని రెట్టింపు చేస్తుంది. రికరింగ్ డిపాజిట్ (RD) స్థిర వడ్డీ రేటుతో క్రమం తప్పకుండా నెలవారీ డిపాజిట్లను అనుమతిస్తుంది.

పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతా స్థిర వడ్డీ రేటును అందించడంతో పాటు సంపాదించిన వడ్డీపై ఒక నిర్దిష్ట పరిమితి వరకు పన్ను ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

ప్రస్తుతం ఈ ప్రభుత్వ పథకాలు డబ్బు సేవింగ్స్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్స్.  

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
భారత దేశం
పర్సనల్ పైనాన్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
మిరాకిల్ ఎప్పుడైనా జ‌ర‌గొచ్చు.. డీమార్ట్ ప్రారంభించే సమయానికి రాధాకిషన్ వయసు ఎంతో తెలుసా.?
Recommended image2
Low Investment Business: ఇంటి నుంచే సంపాదించాలనుకుంటున్నారా? 7 హోం బిజినెస్ ఐడియాస్
Recommended image3
Best Selfie Phones: రూ.20 వేల బడ్జెట్‌లో వచ్చే బెస్ట్ సెల్ఫీ ఫోన్ల జాబితా ఇదిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved