Asianet News TeluguAsianet News Telugu

ఆర్‌బి‌ఐ వడ్డీరేట్లు పెంచే అవకాశాలే ఎక్కువ...నిపుణులు అంచనా...

ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీరేట్లపై ఆర్బీఐ ద్రవ్య సమీక్షలో ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు. గతేడాది ఫిబ్రవరి నుంచి వరుసగా కీలక వడ్డీరేట్లు తగ్గిస్తూ వచ్చిన ఆర్బీఐ డిసెంబర్ నెలలో తొలిసారి ద్రవ్యోల్బణం సాకుగా యధాతథంగా కొనసాగించింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. 
 

RBI Monetary Policy: Key things to know
Author
Hyderabad, First Published Feb 4, 2020, 10:44 AM IST

ముంబై: ఈ ఏడాది భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) వడ్డీరేట్లు పెంచే అవకాశాలే ఎక్కువని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. విజృంభిస్తున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కీలక వడ్డీరేట్లయిన రెపో, రివర్స్‌ రెపోలను ఆర్బీఐ పెంచే వీలుందని సోమవారం ప్రముఖ ఫైనాన్సియల్ రేటింగ్స్ సంస్థ ‘గోల్డ్‌మన్‌ సాచెస్’ అంచనా వేసింది. 

కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు లక్ష్యాలు పెరుగుతుండటంతో ద్రవ్యోల్బణంపై ఆ ప్రభావం ఉంటుందని, అన్ని వస్తు ఉత్పత్తుల ధరలకు రెక్కలు రావచ్చని అభిప్రాయ పడింది. ఇప్పటికే ద్రవ్యోల్బణం గణాంకాలు ఆర్బీఐకి ఆమోదయోగ్యమైన స్థాయిని దాటి పోయాయని గోల్డ్‌మన్‌ సాచెస్ నిపుణులు గుర్తుచేశారు. 

also read కరోనా వైరస్ దెబ్బకు చైనా స్టాక్ మార్కెట్లు విలవిల

ఈ వారంలో జరిగే ద్రవ్యసమీక్షలో రెపో, రివర్స్‌ రెపో వడ్డీరేట్ల పెంపు ఉండవచ్చని గోల్డ్‌మన్‌ సాచెస్ నిపుణులు చెప్పారు. మరోవైపు ఈసారి కూడా వడ్డీరేట్లను యథాతథంగా ఆర్బీఐ ఉంచవచ్చని మరో రేటింగ్స్ సంస్థ డీబీఎస్‌ అంచనా వేసింది.బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సైతం కీలక వడ్డీరేట్లు డిసెంబర్‌ సమీక్షలోలాగే ఎక్కడివక్కడే ఉండే వీలుందన్నది. జనవరి ప్రధాన ద్రవ్యోల్బణం 6.7 శాతానికి దిగజారవచ్చునని డీబీఎస్ అంచనా వేస్తున్నది. 

డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం ఐదేళ్ల గరిష్ఠాన్ని తాకుతూ 7.3 శాతంగా నమోదైంది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు ఉన్న విపత్కర పరిస్థితుల మధ్య వడ్డీరేట్ల పెంపు సాహసం ఆర్బీఐ చేయకపోవచ్చునని ఆర్థికవేత్తలు అంచనా వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు 6-6.5 శాతానికి పెరుగవచ్చన్న ఇటీవలి ఆర్థిక సర్వే అంచనాలూ ఆర్బీఐ ద్రవ్యసమీక్షను సానుకూలంగా ప్రభావితం చేయవచ్చంటున్నారు. కాగా, గతేడాది మొత్తంగా రెపో రేటు 135 బేసిస్‌ పాయింట్లు తగ్గిన సంగతి విదితమే.

RBI Monetary Policy: Key things to know

వచ్చే ఆర్థిక సంవత్సరం 2020-21లో జీడీపీలో ద్రవ్యలోటును 3.8 శాతానికి కట్టడి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం సవాలేనని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా తెలిపింది. ప్రభుత్వ ఆదాయ, వ్యయాల మధ్య ఉన్న వ్యత్యాసమే ఈ ద్రవ్యలోటు. పన్నుల వసూళ్లు ఆశించిన స్థాయిలో లేక ప్రభుత్వ అవసరాలు తీరేందుకు పెట్టుబడుల ఉపసంహరణే మార్గంగా ఉంటుందని తెలిపింది. 

also read ఫోటోలు లీక్:అమెజాన్ సి‌ఈ‌ఓ పై అతని గర్ల్ ఫ్రెండ్ సోదరుడి దావా...

ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ.65వేల కోట్లను సమీకరించాలని నిర్దేశించుకున్న మోదీ సర్కార్.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఏకంగా రూ.2.10 లక్షల కోట్లను లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ క్రమంలోనే జీడీపీలో ద్రవ్యలోటును 3.8 శాతానికి కట్టడి చేస్తామన్న లక్ష్యాన్ని తాజా బడ్జెట్‌లో పెట్టింది. అయినా అసాధ్యమేని ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి చివరి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష మంగళవారం మొదలవుతున్నది. మూడు రోజులు జరిగే ఈ సమీక్షా ఫలితాలు గురువారం వెల్లడి అవుతాయని సోమవారం ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఇంతకుముందు మూడు నెలలకోసారి త్రైమాసిక ద్రవ్యసమీక్షల్ని ఆర్బీఐ నిర్వహించేది. ఇప్పుడు రెండు నెలలకోసారి ద్వైమాసిక ద్రవ్యసమీక్షల్ని చేస్తున్నది. దీంతో ఏడాదికి ఆరు జరుగుతుండగా, ఈ నెలదే చివరి సమీక్ష. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలుకానున్న విషయం తెలిసిందే.
 

Follow Us:
Download App:
  • android
  • ios