కోల్‌కతా: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మంగళవారం బంధన్ బ్యాంకు ప్రమోటర్  వాటాను 40 శాతానికి తగ్గించనందుకు బంధన్ బ్యాంకుపై రూ. 1 కోటి జరిమానగా విధించింది. 2014లో సెంట్రల్ బ్యాంక్ నుండి బంధన్ బ్యాంకు MFI సూత్రప్రాయంగా బ్యాంకింగ్ లైసెన్స్ సార్వత్రికతను పొందింది. ఆగస్టు 2015 నుండి బ్యాంకుగా పూర్తి స్థాయి కార్యకలాపాలను ప్రారంభించింది.

also read జీఎస్టీ రేట్లు తగ్గిస్తామన్న ‘నిర్మల’మ్మ

అయితే  బ్యాంకు ఫైనాన్షియల్ హోల్డింగ్స్ యొక్క వాటాను హోల్డింగ్ మూలధనంలో 40 శాతానికి చెల్లించడంలో విఫలమైన కారణంగా ఆర్‌బిఐ జరిమానా విధించింది.  బ్యాంకు వ్యాపారం ప్రారంభించిన మూడేళ్ళలోపు చెల్లించాలని రుణదాత బిఎస్ఇ ఫైలింగ్లో తెలిపారు.

బంధన్ బ్యాంక్ ఒక ఐపిఓతో బయటకు వచ్చి 2018 మార్చిలో జాబితా చేయబడింది. బ్యాంక్ ఇటీవల కాలంలో  గ్రుహ్ ఫైనాన్స్‌ సంస్థతో విలీనం అయ్యింది. ఇది ప్రమోటర్ యొక్క షేర్  హోల్డింగ్  వాటాను 82.26 శాతం నుండి 60.96 శాతానికి తగ్గించింది. వాటాదారుని షేర్  హోల్డింగ్ 40 శాతానికి తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నట్లు  తెలిపింది.