షాక్: వడ్డీ రేట్లను పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం, ఈఏంఐలు మరింత భారం

RBI goes for back-to-back repo rate hike first time since Oc ..
Highlights

వరుసగా రెండో త్రైమాసికంలో  వడ్డీ రేట్లను పెంచుతూ  ఆర్బీఐ నిర్ణయం తీసుకొంది. రెపోరేటును  25 బేసీస్ పాయింట్లను ఆర్బీఐ పెంచుతూ నిర్ణయం తీసుకొంది. ఆర్బీఐ తాజాగా తీసుకొన్న నిర్ణయంతో  ఈఏంఐల భారం పెరిగే అవకాశం ఉంది.

న్యూఢిల్లీ: వరుసగా రెండో త్రైమాసికంలో  వడ్డీ రేట్లను పెంచుతూ  ఆర్బీఐ నిర్ణయం తీసుకొంది. రెపోరేటును  25 బేసీస్ పాయింట్లను ఆర్బీఐ పెంచుతూ నిర్ణయం తీసుకొంది. ఆర్బీఐ తాజాగా తీసుకొన్న నిర్ణయంతో  ఈఏంఐల భారం పెరిగే అవకాశం ఉంది.

బుధవారం నాడు  ఆర్బీఐ ద్రవ్య పరపతి  సమీక్షించింది. రెపో రేటుపై ఆర్బీఐ నిర్ణయాన్ని వెల్లడించింది. వరుసగా రెండో త్రైమాసికంలో కూడ వడ్డీ రేట్లను పెంచింది. రెపోరేటును  25 బేసిస్ పాయింట్లను పెంచుతూ నిర్ణయం తీసుకొంది. దీంతో రెపో రేటు 6.25 శాతానికి చేరుకొంది.

2018-19 ఆర్ధిక సంవత్సరంలో  వృద్ధిరేటు 7.14 శాతంగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఆర్భీఐ తాజా నిర్ణయం తో ద్రవ్య లభ్యత తగ్గనుందని నిపుణులు చెబుతున్నారు.  మరో వైపు గృహ, వాహనం కొనుగోలు కోసం బ్యాంకుల రుణాల చెల్లింపు వాయిదాలు (ఈఏంఐ)లు మరింత భారమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

ఆర్బీఐ తాజాగా  విడుదల చేసిన  రెపో రేటుపై మార్కెట్లు నెగిటివ్‌గా స్పందించాయి. ఆర్బీఐ రెపోరేటును 25 బేసిస్ పాయింట్లుగా ప్రకటించిన తర్వాత మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ఉదయం పూట లాభాల బాటలో సాగిన మార్కెట్లు ఆర్బీఐ ప్రకటన తర్వాత నష్టాల బాటలో పయనించాయి.
 

loader