Asianet News TeluguAsianet News Telugu

ఆర్‌బీఐ షాకింగ్ నిర్ణయం.. మే 1 నుంచి కొత్త క్రెడిట్ కార్డుల జారీపై నిషేధం..

అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్, డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ‌ల‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిషేధం  విధించింది. 
 

rbi bars american express and diners club to not issue credit cards to new customers from may 1
Author
Hyderabad, First Published Apr 24, 2021, 6:20 PM IST

 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చర్యలో భాగంగా అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్, డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ‌ల‌పై ఆర్‌బీఐ  నిషేధం విధించింది.

ఈ రెండు సంస్థల చెల్లింపు వ్యవస్థ డేటా స్టోరేజ్ నిబంధనలకు అనుగుణంగా లేదంటూ కొత్త దేశీయ క్రెడిట్ కార్డులను జారీ చేయకుండా  బ్యాన్ చేసింది.

డేటా, ఇతర సమాచార నిర్వహణ నియమాలను ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కార్డ్ నెట్‌వర్క్‌లపై ఆంక్షలు ప్రస్తుతం ఉన్న వినియోగదారులపై ప్రభావం చూపదని సెంట్రల్ బ్యాంక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

also read మహాభారతం కాలానికి చెందిన ఈ కోట అసలు రహస్యం ఇదే.. దీని కథ వింటే ఆశ్చర్యపోతారు.. ...

అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్ మరియు డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ చెల్లింపు వ్యవస్థ ఆపరేటర్లు. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007 (పిఎస్ఎస్ యాక్ట్) కింద దేశంలో కార్డ్ నెట్‌వర్క్‌ను నిర్వహించడానికి ఇద్దరికీ అధికారం ఉంది.

పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007 (పీఎస్ఎస్ యాక్ట్) సెక్షన్‌ 17 కింద కార్డు నెట్‌వర్క్ ఆపరేటింగ్‌కు సంబంధించి అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్, డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ‌లకు అనుమతి ఉంది.  

చెల్లింపు వ్యవస్థతో అనుసంధానించిన అన్ని సర్వీసు ప్రొవైడర్లు, వారు నిర్వహించే చెల్లింపు వ్యవస్థకు సంబంధించిన డాటా, ఇతర సమాచారాన్ని ఆరు నెలల్లో త‌మ ముందు ఉంచేలా చూడాలని 2018 ఏప్రిల్‌లోసర్క్యులర్ ద్వారా సూచించింది.

దీనిపై అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ఒక ప్రకటన విడుదల చేసింది  వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించడానికి  ఆర్‌బీఐ కలిసి పని చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఉత్త‌ర్వులు   ప్రస్తుత భారతీయ కస్టమర్లను ప్రభావితం చేయదని, కార్డులను  యథాతధంగా ఉపయోగించవచ్చునని స్పష్టం చేసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios