టాటా సన్స్ ఛైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటాని "చోటు" అని ఇన్‌స్టాగ్రామ్ చేసిన ఒక కామెంట్ నెటిజన్ల మనసు గెలుచుకుంది. 82 ఏళ్ల మిస్టర్ టాటా గత ఏడాది అక్టోబర్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో చేరారు.

మంగళవారం అతను ఫోటో, వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌ అయిన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక మిలియన్ మంది ఫలోవర్స్ చేరుకున్నారు. ఈ సందర్భంగా వ్యాపారవేత్త అయిన రతన్ టాటా  ఒక పోస్ట్ పెట్టాడు.

"ఈ అద్భుతమైన ఆన్‌లైన్ ఫ్యామిలి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చేరినప్పుడు ఇలా ఉంటుందని ఉహించలేదు. దానికి నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని రతన్ టాటా పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో 3.7 లక్షల మందికి పైగా లైక్ చేశారు.

also read వాలంటైన్స్ డే ఆఫర్...తక్కువ ధరకే ఫ్లయిట్ టికెట్లు...

కామెంట్స్ విభాగంలో చాలా మంది రతన్ టాటా పెట్టిన పోస్ట్ కి కాంప్లిమెంట్స్ ఇచ్చారు.  

"కంగ్రాచులేషన్స్ చోతు" అని ఇన్‌స్టాగ్రామ్ ఒక యూజర్ మొదట కామెంట్ రాశారు. దానికి వెంటనే కొందరు స్పందిస్తు ఇది చాలా "అగౌరవం", "సిగ్గుచేటు" అతను ఎందరికో ఆదర్శం అతనిని అలా అంటావా అని కామెంట్స్  వర్షం  కురిపించారు.

తరువాత కామెంట్లో ఆమె "చోటు" అనే పదాన్ని ఉపయోగించడానికి సమర్థిస్తు" అతను ప్రతి ఒక్కరికీ  ఆదర్శం" ఇంకా  "అతనిపై ఉన్న ప్రేమను నేను ఏదైనా పదం ద్వారా అయిన చెప్పగలను" అని రాశారు.

తరువాత కూడా ఆమె మాటలను చాలా మంది విమర్శిస్తూనే ఉన్నారు. చివరికి రతన్  టాటా స్వయంగా ఆ కామెంట్ కి  స్పందించారు.

"మనలో ప్రతి ఒక్కరిలో ఒక పిల్లవాడు ఉంటాడు. దయచేసి ఈ యువతిని గౌరవంగా చూడండి" అని కామెంట్ రాశాడు. చివర్లో చిరునవ్వు సింబల్ ని కూడా పెట్టాడు.

also read వంట గ్యాస్ ధర మళ్ళీ పెరిగింది...సిలిండర్ పై ఎంతంటే ?

రతన్ టాటా చేసిన  కామెంట్ కి సుమారు 4,000 కన్నా ఎక్కువ 'లైక్స్' వచ్చాయి. ఇంకా తన కామెంట్ కి ఇన్‌స్టాగ్రామ్‌లో విస్తృతంగా ప్రశంసలు కూడా అందుకుంటోంది.

మరొకరు అయితే మీది "అద్భుతమైన సమాధానం, సార్" అని చెప్పి అభినందించారు.

బుధవారం మిస్టర్ రతన్ టాటా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా పంచుకున్న వరుస పోస్ట్‌లలో ఈ సమస్యను మరోసారి వైరల్ అయింది.

ఈ విషయాన్ని రతన్ టాటా  ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా పెట్టి  తనని మరో సారి అభినందిస్తు పోస్ట్ చేశాడు.