Asianet News TeluguAsianet News Telugu

ఆయనే నా గురువు, నా రోల్ మోడల్ ...అంటూ ఎమోషనల్ పోస్ట్

‘‘జేఆర్‌డీ టాటా కన్నుమూసి 26 ఏళ్లు అవుతుందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఆయన నాకు ప్రియ స్నేహితుడేకాక, రోల్‌ మోడల్‌, గురువు. ఆయన ప్రభావం నాపై ఎంతో ఉంది’ అని రతన్‌ టాటా పేర్కొన్నారు.

ratan tata remembers "friend,mentor " jrd tata in instagram post
Author
Hyderabad, First Published Nov 30, 2019, 10:19 AM IST

న్యూఢిల్లీ: టాటా సంస్థల వ్యవస్థాపకుడు జేఆర్‌డీ టాటా వర్థంతి సందర్భంగా సంస్థ ప్రస్తుత గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా భావోద్వేగపు పోస్ట్‌ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘జేఆర్‌డీ టాటా కన్నుమూసి 26 ఏళ్లు అవుతుందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఆయన నాకు ప్రియ స్నేహితుడేకాక, రోల్‌ మోడల్‌, గురువు. ఆయన ప్రభావం నాపై ఎంతో ఉంది’ అని పేర్కొన్నారు.

also read మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

‘మేమిద్దరం కలిసి ఎంతో సమయం పాటు టెల్కోలో (టాటా ఇంజినీరింగ్‌ అండ్‌ లోకోమోటివ్‌ కంపెనీ ప్రస్తుత టాటా మోటర్స్‌) పని చేసేవాళ్లం. పనివాళ్లు, సూపర్‌వైజర్లపై ఆయన చూపించే అభిమానం, స్వచ్ఛమైన ప్రేమను మర్చిపోలేను.’’ అని పోస్ట్‌లో వివరించారు.

ratan tata remembers "friend,mentor " jrd tata in instagram post

రతన్‌ టాటా చేసిన ఈ పోస్ట్‌ను కొంత సేపట్లోనే 1.7 లక్షల మంది లైక్‌ చేయగా, వేలాది కామెంట్లు రాశారు. జెహంగీర్‌ రతన్‌జీ దాదాబాయ్‌ టాటా 89 ఏళ్ల వయసులో 1993 నవంబర్ 29న కన్నుమూశారు. ప్రస్తుతం రతన్ టాటా చేసిన ట్వీట్ 2.10 లక్షల మందికి పైగా ట్వీట్ చేశారు. 

also read  కార్వీ చీఫ్‌ రాజీనామా...ఫిన్‌టెక్‌కు త్వరలో కొత్త చైర్మన్?

ratan tata remembers "friend,mentor " jrd tata in instagram post

ఇదిలా ఉంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలోని ‘పనామా పేపర్స్’లో గల్ఫ్ బిజినెస్ మెన్ పొరపాటున టాటా గౌరవ చైర్మన్ రతన్ టాటా పేరు ప్రస్తావించారని లీకైన మోసాక్ ఫోన్సేకా సంచలనం నెలకొల్పింది. 1986లో కోరల్ రిసార్ట్స్ డెవలప్మెంట్ డైరెక్టర్ కమ్ ప్రెసిడెంట్‌గా ఉన్న రతన్ టాటా పేరును 2015 నవంబర్ నెలలో విడుదల చేసిన పనామా పేపర్స్‌లో పొరపాటున విడుదల చేసినట్లు వెల్లడించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios