ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ అధినేత రతన్ టాటా బుధవారం సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచారు. టాటా సన్స్ బోర్డు రూమ్‌లో తాను నవ్వుతూ దిగుతున్న ఫొటోను ఖాతాలో షేర్ చేశారు. అంతటితో ఆగక ఆసక్తికరమైన వ్యాఖ్య కూడా జత చేశారు. 

‘నేను ఇంటర్నెట్‌ను బద్ధలు కొట్టలేకపోవచ్చు. ఇంటర్నెట్ లో సంచలనం సృష్టించడం నాకు తెలియదు. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో చేరడానికి చాలా ఆసక్తిగా ఉన్నాను. ప్రజా జీవితం నుంచి చాలా రోజులుగా దూరంగా ఉన్న తర్వాత, మీతో కథలు పంచుకోవడానికి, భిన్న కోణాలు ఉన్న సమాజంతో కలిసి నూతన అనుభూతులు కలబోసుకోవడానికి, సృష్టించుకోవడానికి ఎంతో ఆతురతతో ఎదురు చూస్తున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో అందరితో కలువడం చాలా ఉద్వేగంగా ఉంది’ అని క్యాప్షన్ పెట్టారు.

also read బంధన్ బ్యాంకుపై జరిమాన విధించిన ఆర్‌బిఐ !

రతన్ టాటా ఈ పోస్టు పెట్టిన కొద్దిసేపట్లోనే 16 వేల మంది లైక్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లోకి చేరినందుకు ఆయన అభిమానులు స్వాగతం పలుకుతున్నారు. ‘వెల్ కమ్ సూపర్ బాస్’, ‘’వెల్ కం సర్’ అని కామెంట్లు జోడిస్తున్నారు. ఆయన చేసిన కామెంట్స్‌ను దాదాపు 1,80,238 మంది లైక్ కొట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రతన్ టాటా చేరడం కొందరు ఆయన అభిమానులు ‘బెస్ట్ దీపావళి గిఫ్ట్’ అని అభివర్ణిస్తున్నారు.

బుధవారం రాత్రి 11 గంటల సమయానికి 85 వేల మంది రతన్ టాటాను ఫాలో అవుతున్నట్లు తెలుస్తున్నది. ఈ ఖాతాను ధ్రువీకరించినట్లు కూడా ఇన్ స్టాగ్రామ్ టిక్ మార్క్ ఇచ్చేసింది. దాంతోపాటు ఆయన గురించి పరిచయ వాక్యాల్లో ‘ఐ మేడ్ ఇట్ టు ది గ్రామ్!’ చైర్మన్, టాటా ట్రస్ట్, చైర్మన్ ఎమిరేట్స్- టాటా సన్స్ అని రాశారు. 

also read సౌదీలోనూ చకచకా దూసుకెళ్తున్న మన ‘రూపే’కార్డు...

1999 నుంచి 2014 వరకు టాటా సన్స్ చైర్మన్‌గా, 2016 అక్టోబర్ నుంచి 2017 ఫిబ్రవరి వరకు తాత్కాలిక చైర్మన్ గా రతన్ టాటా పని చేశారు. ప్రస్తుతం టాటా సన్స్ చారిటబుల్ ట్రస్టులకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఫేస్ బుక్ ఆధ్వర్యంలోని ఫోటో షేరింగ్ వేదిక ట్విట్టర్ లోనూ సభ్యుడినని ప్రకటించారు. 

2011 ఏప్రిల్ నుంచి ట్విట్టర్ ఖాతాలో యాక్టివ్ గా ఉన్నప్పటి నుంచి 76 లక్షల మంది ఫాలోవర్లు రతన్ టాటాకు జత కలిశారు. కానీ ట్విట్టర్‌లో కొద్ది సేపు మాత్రమే కొన్ని నెలల క్రితం వరు తన సభ్యులతో ఇంటరాక్ట్ అవుతారు. పారిశ్రామిక రంగంలో ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2000లో పద్మభూషణ్, 2008 పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించింది.