RRB ALP Recruitment : రైల్వేలో జాబ్ కొట్టాలని ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. అసిస్టెంట్ లోకో పైలెట్ రిక్రూట్మెంట్ లో భాగంగా నిర్వహించనున్న పరీక్షకు బోర్డు ఎగ్జామ్ తేదీని కన్ఫమ్ చేసింది. ఆ తేదీల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ 2024లో నోటిఫికేషన్ ఇచ్చిన అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) రిక్రూట్‌మెంట్ కు సంబంధించి సెకండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT2) తేదీని ప్రకటించింది. అధికారిక ప్రకటన ప్రకారం, ఆర్ఆర్‌బీ ఏఎల్‌పీ సీబీటీ 2 మార్చి 19, 20 తేదీల్లో జరుగుతుంది. ఎగ్జామ్ సెంటర్, తేదీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత ప్రయాణం కోసం అవసరమైన కార్డు డౌన్‌లోడ్ లింక్ ను పరీక్ష తేదీకి 10 రోజుల ముందు ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్‌లో విడుదల చేస్తారు.
ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. జేఈ, డీఎంఎస్, సీఎంఏ వంటి వివిధ పోస్టులకు నిర్వహించే సీబీటీ 2 పరీక్షను కూడా పునఃపరిశీలన చేశారు. జేఈ, ఇతర పోస్టులకు సీబీటీ 2 పరీక్ష సవరించిన తేదీని త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. పరీక్ష తేదీకి నాలుగు రోజుల ముందు ఎగ్జామ్ సెంటర్, ఈ-కాల్ లెటర్ లేదా అనుమతి కార్డు విడుదల చేస్తారు.
రైల్వే లోకో పైలెట్ పరీక్ష కోసం ఈ-వెరిఫికేషన్ చేసుకోండి
ఎగ్జామ్ హాల్ లోకి ప్రవేశించే ముందు ఆధార్ కార్డు ఉపయోగించి పరీక్ష కేంద్రంలో అభ్యర్థుల బయోమెట్రిక్ గుర్తింపు జరుగుతుందని ఆర్ఆర్‌బీ తెలిపింది. కాబట్టి అభ్యర్థులందరూ వారి అసలు ఆధార్ కార్డు లేదా ఈ-వెరిఫైడ్ ఆధార్ ప్రింట్ తీసుకురావాలి.
పరీక్ష కేంద్రంలో చెకింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదంటే ముందుగానే rrbapply.gov.in అనే వెబ్‌సైట్‌లో వారి సర్టిఫికెట్లతో లాగిన్ అయి ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. అభ్యర్థులు రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ తాజా అప్‌డేట్‌ల కోసం ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లను మాత్రమే చూడమని సలహా ఇస్తున్నారు.
రైల్వేలో ఉద్యోగాల కోసం మోసగాళ్లను నమ్మొద్దు
చట్టవిరుద్ధంగా ఉద్యోగం ఇప్పిస్తామని అబద్ధపు వాగ్దానాలు చేసి అభ్యర్థులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించే మధ్యవర్తులతో అప్రమత్తంగా ఉండాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. ఆర్ఆర్‌బీ పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా జరుగుతుంది. రిక్రూట్‌మెంట్ అభ్యర్థుల అర్హత ఆధారంగా మాత్రమే ఉంటుందని తెలిపారు.
అసిస్టెంట్ లోకో పైలట్ ఖాళీలు మొత్తం 18,799
18,799 అసిస్టెంట్ లోకో పైలట్ ఖాళీల కోసం ఆర్ఆర్‌బీ మొదట 5,696 ఖాళీలకు ప్రకటన చేసింది. జేఈ డీఎంఎస్, సీఎంఏ వంటి వివిధ పోస్టులకు 7951 ఖాళీలు ఉన్నాయి. ఇందులో 17 ఖాళీలు కెమికల్ సూపర్‌వైజర్ / రీసెర్చ్, మెటల్ సూపర్‌వైజర్ / రీసెర్చ్ పోస్టులకు, 7934 ఖాళీలు జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్, మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులకు భర్తీ చేస్తారని తెలిపారు.