Asianet News TeluguAsianet News Telugu

బ్యాంక్ కస్టమర్లకు షాక్.. ఆగస్ట్ 1 నుంచి కొత్త రూల్స్..

మీకు ఏదైన బ్యాంక్‌లో అకౌంట్ ఉందా? అయితే మీరు కొన్ని విషయాలు ఎప్పటికప్పుడు కచ్చితంగా తెలుసుకోవాలి. కొన్ని బ్యాంకులు వచ్చే నెల నుంచి కొత్త రూల్స్‌ను అమలు చేస్తున్నాయి. దీంతో కస్టమర్లపై చార్జీల ప్రభావం పడనుంది.

private  banks to increase cash handling charges from august 1
Author
Hyderabad, First Published Jul 18, 2020, 3:10 PM IST

మీకు ఏదైన బ్యాంక్‌లో అకౌంట్ ఉందా? అయితే మీరు కొన్ని విషయాలు ఎప్పటికప్పుడు కచ్చితంగా తెలుసుకోవాలి. బ్యాంకులు కస్టమర్ల నుంచి చార్జీల రూపంలో బాదుడు మొదలెట్టేందుకు సిద్దమవుతున్నాయి.

మినిమమ్ బ్యాలెన్స్, క్యాష్ ట్రాన్సాక్షన్లపై కూడా చార్జీలు విధించేందుకు సన్నాహాలు చేస్తుంది. దీంతో బ్యాంక్ ఖాతాదారులపై తీవరమైన ఎఫెక్ట్ పడనుంది. బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర, యాక్సిస్ బ్యాంక్ , కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంకులు చార్జీలు విధించనున్నాయి.

బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర అకౌంట్‌దారులు వారి అకౌంట్లలో రూ.2,000 మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే మినిమమ్ బ్యాలెన్స్ రూ.1,500గా ఉండేలా చూసుకోవాలి. బ్యాంక్ ఖాతాదారులు ఈ బ్యాలెన్స్ కన్నా తక్కువ మొత్తాన్ని కలిగి ఉంటే రూ.20 నుంచి రూ.75 వరకు చార్జీలు విధించనున్నాయి.

also read  నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో 10వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు.. ...

అలాగే బ్యాంక్‌కు వెళ్లి నగదు లావాదేవీలు నిర్వహించాలంటే అందుకు కూడా చార్జీలు కస్టమర్లపై పడనుంది. తొలి 3 ట్రాన్సాక్షన్లకు ఉచితం అని మీకు తెలిసిందే. కానీ 3 ట్రాన్సాక్షన్లు దాటితే డబ్బులు విత్‌డ్రా చేయాలన్నా, డిపాజిట్ చేయాలన్నా రూ.100 చెల్లించుకోవాల్సిందే.

యాక్సిస్ బ్యాంక్ కూడా ఈసీఎస్ ట్రాన్సాక్షన్లపై రూ.25 చార్జీ వసూలు చేయనుంది. ప్రస్తుతం ఈ లావాదేవీలు ఉచితంగా అందిస్తుంది. అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్లకు కూడా చార్జీల భారం పడనుంది. నెలకి 5 సార్లు డెబిట్ కార్డు ఏటీఎం ట్రాన్సాక్షన్లు దాటితే తర్వాత ప్రతి లావాదేవీకి రూ.20 చెల్లించుకోవలసి వస్తుంది.

ఇది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు వర్తిస్తుంది. అదే నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు అయితే రూ.8.5 చార్జీ పడుతుంది. అలాగే ఈ బ్యాంక్ ప్రతి నాలుగో క్యాష్ విత్‌డ్రా ట్రాన్సాక్షన్‌పై కూడా రూ.100 చార్జీలు వసూలు చేయనుంది. దీని ప్రకారం చూస్తే వచ్చే నెల నుంచి ఏ‌టి‌ఎం లావాదేవీలపై, నగదు లావాదేవీలాపై కొత్తగా అదనపు చార్జీల భారం పడనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios