Asianet News TeluguAsianet News Telugu

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో 10వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు..

ప్రముఖ కంపెనీలతో సహ ఇతర సంస్థలు కూడా వేతనాలలో కోత, ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగుల కోతలు విధిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. త్వరలో 10వేలకు పైగా ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనున్నట్లు తెలిపింది. 

andhra pradesh govt to recruit over 10 thousand jobs in healthcare workers
Author
Hyderabad, First Published Jul 18, 2020, 1:58 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ కారణాంగ నిరుద్యోగం రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రముఖ కంపెనీలతో సహ ఇతర సంస్థలు కూడా వేతనాలలో కోత, ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగుల కోతలు విధిస్తున్నాయి.

ఇలాంటి సమయంలో ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. త్వరలో 10వేలకు పైగా ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనున్నట్లు తెలిపింది. వైద్య ఆరోగ్య రంగానికి పెద్ద పిట వేస్తూ ఇందులో 9,712 ఉద్యోగాలు వైద్య ఆరోగ్య శాఖలోనే ఉండటం విశేషం.

also read చేతిలో 20 పైసల నాణెం ఉంటే లక్షాధికారి కావొచ్చు.. ఎలా అనుకుంటున్నారా ? ...

ఈ ఉద్యోగాల్లో వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్లు, నర్సులతో పాటు మిగిలిన వైద్య సిబ్బందిని కూడా నియమించుకొనున్నారు. ఈ రంగంలో ఉన్న 9,712 పోస్టుల్లో 5,701 కొత్త ఉద్యోగాలు, మిగిలినవి 4,011 ఖాళీగా ఉన్న పోస్టులు. ఇంతకుముందు జరిగిన కేబినెట్‌ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు.

వీటికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ(గుంటూరు) హోం సైన్స్ విభాగంలో 2 ఫ్రొపెసర్‌, 4 అసోసియేటివ్‌ ప్రొఫెసర్‌ పోస్టులు. వైఎస్సార్ జిల్లాలోని వైఎస్సార్ హార్టికల్చర్‌ యూనివర్సిటీ కింద అరటి పరిశోధన సంస్థకు 11 పోస్టులు (5 టీచింగ్‌, 6 నాన్ టీచింగ్ పోస్టులు), సీఐడీ విభాగంలో 10 జూనియర్ అసిస్టెంట్‌లు, 10 స్టెనో పోస్టులు, ఒంగోలు ట్రిపుల్ ఐటీలో 210 టీచింగ్, 89 నాన్ టీచింగ్ పోస్టులు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో 201 టీచింగ్‌, 89 నాన్ టీచింగ్ పోస్టులు స్కూల్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్‌ కమిషన్‌లో 28 పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios