రూ.78,000 పొందడం ఎలా ? పోస్టాఫీసులో ఎలా దరఖాస్తు చేయాలి ? పూర్తి వివరాలు ఇవే..
ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్తీ బిజిలీ యోజన సోలార్ రూఫ్‌టాప్ స్కీమ్‌కు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. అయితే దీని కోసం ఎలా దరఖాస్తు చేయాలి? దానికి కావాల్సినవి ఏమిటీ ? ఇక్కడ తెలుసుకోండి...
ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కోసం పోస్టల్ శాఖ రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. ఈ స్కిం సోలార్ ప్యానల్స్ వ్యవస్థాపించడానికి ఆర్థిక సహాయం అందించడానికి సహాయపడుతుంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) విడుదల ప్రకారం, “పోస్ట్‌మెన్ ఈ రిజిస్ట్రేషన్ సంబంధించి సహాయం చేస్తారు. స్వచ్ఛమైన, తక్కువ ఖర్చుతో కూడిన ఎనర్జీ ఫ్యూచర్ కోసం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మేము అందరిని ప్రోత్సహిస్తున్నాము అని తెలిపింది.
పోస్ట్‌మెన్ రిజిస్ట్రేషన్ సమయంలో కుటుంబాలకు సహాయం చేస్తారు. మరింత సమాచారం కోసం, https://pmsuryaghar.gov.in/ని సందర్శించండి లేదా ఏరియా పోస్ట్‌మాస్టర్‌ను సంప్రదించండి. మరిన్ని వివరాల కోసం దయచేసి మీ సమీపంలోని పోస్టాఫీసును సంప్రదించవచ్చు .
ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్తీ బిజిలీ యోజన: ప్లాన్ ఏమిటి?
ఈ పథకం కింద, రూఫ్‌టాప్ సోలార్ పవర్‌ను అమర్చుకునే గృహాలకు ఉచిత విద్యుత్, ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించబడుతుంది.
మొత్తం మంజూరు ఎంత?
ఈ పథకం ప్రస్తుత ప్రధాన ధర ప్రకారం 1 KW సిస్టమ్‌కు రూ.30,000, 2 KW సిస్టమ్‌కు రూ.60,000 ఇంకా 3 KW లేదా అంతకంటే ఎక్కువ సిస్టమ్‌లకు రూ.78,000 సబ్సిడీని అందిస్తుంది.
పథకం కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
1.మొదట https://pmsuryaghar.gov.in/ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోండి
2.మీ విద్యుత్ వినియోగదారు నంబర్, మొబైల్ నంబర్ అండ్ ఇమెయిల్ చిరునామాను ఎంటర్ చేయండి.
3.ఫారమ్ ప్రకారం రూఫ్‌టాప్ సోలార్ కోసం దరఖాస్తు చేసుకోండి.
4.ఆమోదం పొందిన తర్వాత, మీ డిస్కమ్(DISCOM) రిజిస్టర్డ్ విక్రేతల ద్వారా ప్లాంట్‌ను ఇన్‌స్టాల్ చేయండి.
5.ప్లాంట్ వివరాలను సమర్పించి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోండి.
6.దీని తరువాత పోర్టల్ నుండి కమీషన్ సర్టిఫికేట్ రూపొందించబడుతుంది.
7.మీరు పోర్టల్ ద్వారా బ్యాంక్ అకౌంట్ వివరాలను అండ్ క్యాన్సల్ చేసిన చెక్కును సమర్పించాలి.
8.మీరు 30 రోజుల్లోగా మీ బ్యాంక్ ఖాతాలో మీ గ్రాంట్‌ని అందుకుంటారు.