దేశంలోని 5 రాష్ట్రాల్లో  అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరో వారం రోజుల్లో రానున్నాయి. అనంతరం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని JP మోర్గాన్ నివేదిక పేర్కొంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు 9 రూపాయల వరకు పెంచవచ్చని కంపెనీలు పేర్కొంటున్నాయి. 

Petrol-Diesel Price:దేశంలోని 5 రాష్ట్రాలలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వారంలో ముగియనున్నాయి. ఆ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని JP మోర్గాన్ నివేదిక పేర్కొంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు 9 రూపాయల వరకు పెంచవచ్చని కంపెనీలు పేర్కొన్నాయి. మరోవైపు అంతర్జాతీయంగా ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరుకుంది, ఇది దేశీయ మార్కెట్‌పై కూడా ప్రభావం చూపనుంది.

నవంబర్ నుంచి పెట్రోలు, డీజిల్ ధరలు పెరగలేదు
గత ఏడాది నవంబర్‌ నుంచి పెట్రోల్‌ పంపుల్లో లభించే పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) డీజిల్ ధరలపై లీటరుకు రూ. 5 నుంచి 7 సాధారణ మార్జిన్‌పై లీటరుకు రూ. 2.5 నష్టపోతున్నాయని అంచనా వేస్తున్నాయి. ముడి చమురు, డీజిల్ ఫారెక్స్‌లో అస్థిరత దృష్ట్యా, భవిష్యత్తులో రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలను మార్చాల్సిన అవసరం ఉందని ఓఎంసీలు పేర్కొంటున్నాయి.

ముడి చమురు ధర పెరుగుతోంది
మరోవైపు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 2014 మధ్యకాలం తర్వాత మొదటిసారిగా బ్యారెల్‌కు 110 డాలర్ల కంటే ఎక్కువ పెరిగాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న సంక్షోభం కారణంగా, ముడి చమురు సరఫరా ప్రభావితం కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. చమురు, గ్యాస్ దిగ్గజ కంపెనీలు రష్యాలో చాలా ఉన్నాయి. ఆ దేశంపై విధించిన ఆంక్షల కారణంగా వారితో సరఫరాపై ఎఫెక్ట్ పడుతుందని , ఫలితంగా ధరలపై ప్రభావం కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు.

కంపెనీల ఖర్చులు పెరగడం
చమురు మంత్రిత్వ శాఖలోని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (PPAC) సమాచారం ప్రకారం, భారతదేశంలో ముడి చమురు కొనుగోళ్లు మార్చి 1న బ్యారెల్‌కు 102 డాలర్ల కంటే ఎక్కువ పెరిగాయి, ఇది ఆగస్టు 2014 తర్వాత అత్యధికం.

ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయి
ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు ఫిబ్రవరి 7న ప్రారంభం కాగా అన్ని దశలు పూర్తి చేసుకొని ఓట్ల లెక్కింపు మార్చి 10న నిర్వహించనున్నారు. 

ధర రూ.9 వరకు పెరగవచ్చు
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సాధారణ మార్కెటింగ్ మార్జిన్‌కు వెళ్లాలంటే రిటైల్ ధరలను లీటరుకు రూ. 9 లేదా 10 పెంచాలని నివేదిక పేర్కొంది. భారతదేశం తన చమురు అవసరాలలో 85 శాతం దిగుమతి చేసుకుంటుంది కాబట్టి దేశీయ ఇంధన ధరలు అంతర్జాతీయ చమురు ధరలతో నేరుగా ముడిపడి ఉన్నాయి. వరుసగా 118 రోజులు అందులో ఎలాంటి మార్పు లేదన్న విషయం గమనించాలి.