Asianet News TeluguAsianet News Telugu

Post office scheme: అద్భుతమైన స్కీమ్.. రూ.35 లక్షలు సొంతం..!

తక్కువ పెట్టబడితో ఎక్కువ ఆదాయం పొందాలనుకునేవారికి పోస్టాఫీస్‌ ఒక మంచి స్కీమ్‌ను (Scheme‌) అమలు చేస్తోంది. అలాగే ఈ పథకం కుటుంబ ఆర్థిక భద్రతకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. 

Post office scheme
Author
Hyderabad, First Published Jan 22, 2022, 4:13 PM IST

తక్కువ పెట్టబడితో ఎక్కువ ఆదాయం పొందాలనుకునేవారికి పోస్టాఫీస్‌ ఒక మంచి స్కీమ్‌ను (Scheme‌) అమలు చేస్తోంది. అలాగే ఈ పథకం కుటుంబ ఆర్థిక భద్రతకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇండియా పోస్ట్ గ్రామీణ కార్యక్రమంలో భాగంగా.. "గ్రామ్ సురక్ష యోజన" (Gram Suraksha Yojana) స్కీమ్‌ను అమలు చేస్తోంది. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో భాగంగా ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది ఇండియా పోస్ట్. దేశంలోని గ్రామీణుల కోసం 1995లో గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని (Rural Postal Life Insurance Policy) రూపొందించింది ఇండియా పోస్ట్. (India Post) 

గ్రామ్ సురక్ష యోజన స్కీమ్‌లో (Gram Suraksha Yojana Scheme) చేరిన వారికి 80 సంవత్సరాలు వ‌య‌స్సు వచ్చాక.. అంటే మెచ్యూరిటీ (Maturity) సమయంలో బోనస్ వస్తుంది. ఒకవేళ ఈ స్కీమ్‌లో చేరిన వారు ముందే మరణిస్తే, నామినీ లేదా కుటుంబ సభ్యులకు అందుకు సంబంధించిన డబ్బు అందిస్తుంది పోస్టాఫీస్. 19 ఏళ్ల నుంచి 55 సంవత్సరాల వయసు ఉన్న వారంతా ఈ పథకంలో చేరేందుకు అర్హులు. 

ఇక ఈ స్కీమ్‌ కోసం కనీసం రూ.10 వేల ఇన్సూరెన్స్‌ మొత్తానికి పాలసీ తీసుకోవాలి. అలాగే గరిష్టంగా రూ.10 లక్షల ఇన్సూరెన్స్ (Insurance) మొత్తానికి పాలసీ తీసుకోవచ్చు. ప్రీమియాన్ని.. నెల వారీగా, మూడు నెలల వారీగా, ఆరు నెలల వారీగా, ఏడాదొకసారి చొప్పున చెల్లించే వెసులుబాటు కల్పించింది ఇండియా పోస్ట్. (India Post) ప్రీమియం (Premium) చెల్లింపునకు 30 రోజుల గ్రేస్ పీరియడ్ వెసులుబాటు కూడా ఉంటుంది. ఇక పాలసీ కొనుగోలు చేసిన నాలుగేళ్లకు లోన్ కూడా పొందొచ్చు. 55 సంవత్సరాలు, 58 సంవత్సరాలు, 60 సంవత్సరాలు వచ్చే వరకు ప్రీమియం చెల్లించవచ్చు. అలాగే ఈ స్కీమ్‌లో జాయిన్ అయిన వారికి సంవత్సరానికి రూ.1000కు రూ.60 బోనస్ ఇస్తుంది పోస్టాఫీస్ (Post Office)

ఇక 19 ఏళ్ల వయసులో రూ.10 లక్షల పాలసీ తీసుకుంటే, 55 సంవత్సరాలు వచ్చే వరకు ప్రీమియం చెల్లిస్తే మెచ్యూరిటీ టైమ్‌లో (Maturity Time‌) రూ. 31.6 లక్షలు తీసుకోవచ్చు. అలాగే 58 ఏళ్లు వచ్చే వరకు ప్రీమియం చెల్లిస్తే రూ. 33.4 లక్షలు అందుకోవచ్చు. ఇక 60 ఏళ్లు వచ్చే వరకు ప్రీమియం (Premium) చెల్లిస్తే రూ. 34.6 లక్షలు వస్తాయి. ఇలా మెచ్యూరిటీ బెనిఫిట్‌లు పొందొచ్చు.  అలాగే నెలవారీ ప్రీమియం విషయానికి వస్తే, 55 ఏళ్లకు రూ.1515 ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. ఇక 58 ఏళ్లకుగాను రూ.1463, 60 ఏళ్లకు అయితే రూ.1411 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఈ స్కీమ్‌తో తక్కువ డబ్బుతో ఎక్కువ ఆదాయాన్ని కల్పిస్తుంది ఇండియా పోస్ట్.

Follow Us:
Download App:
  • android
  • ios