Asianet News TeluguAsianet News Telugu

నీరవ్ మోదీ ఎఫెక్ట్: నిధుల కోసం పీఎన్బీ హైసింగ్ ఫైనాన్స్ విక్రయం?

పంజాబ్ నేషనల్ బ్యాంక్ తనకు అవసరమైన నిధుల సమీకరించడానికి ‘పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్’ విభాగం వాటాను పూర్తిగా విక్రయించడానికి అనువైన వ్యూహాత్మక ఇన్వెస్టర్ కోసం ఎదురుచూస్తోంది

PNB to sell stake in housing finance arm by fiscal end

న్యూఢిల్లీ /ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ తనకు అవసరమైన నిధుల సమీకరించడానికి ‘పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్’ విభాగం వాటాను పూర్తిగా విక్రయించడానికి అనువైన వ్యూహాత్మక ఇన్వెస్టర్ కోసం ఎదురుచూస్తోంది. పీఎన్బీ మెట్ లైఫ్ ఐపీఓలోని వాటాలను కూడా విక్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆభరణాల వ్యాపారులు నీరవ్ మోదీ - అతడి మేనమామ మెహుల్ చోక్సీ జోడీ ‘గ్యారంటీ’ల పేరిట పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)కి రూ.14,356 కోట్ల శఠగోపం పెట్టారు. అటుపై దేశం విడిచిపోయి పారిపోయారు. 

నిధుల సేకరణపై పీఎన్బీ ఫోకస్
ఈ నేపథ్యంలో నిధుల సమీకరణపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ద్రుష్టి సారించింది. నీరవ్ మోదీ కుంభకోణం సాక్షిగా మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) షేర్ ఆరు శాతానికి దిగువన పడిపోయింది. గత నెలలో బాంబే స్టాక్ ఎక్చ్సేంజ్ (బీఎస్ఈ)కి ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన హౌసింగ్ ఫైనాన్స్, దాని అనుబంధ కార్ల్యేల్ గ్రూప్ 51 శాతం వాటాను కూడా విక్రయించనున్నదని తెలిపింది.

పీఎన్బీ హైసింగ్ విలువ రూ.11,150 కోట్లు
మంగళవారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ముగిసే నాటికి 51 శాతం పీఎన్బీ హౌసింగ్ షేర్ల మొత్తం విలువ రూ.11,150.8 కోట్లకు చేరింది. క్లోజింగ్ షేర్ ధర రూ.1,305.7 వద్ద స్థిర పడింది. 2016 నవంబర్ నెలలో కంపెనీ ఇన్సియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా రూ.3000 కోట్ల ఈక్విటీ నిధులను సేకరించింది. తద్వారా పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్‌లో పీఎన్బీ వాటాను 51 నుంచి 39 శాతానికి తగ్గించేసింది. 2009 - 14 మధ్య డెస్టీమనీ ఎంటర్ ప్రైజెస్ సంస్థకు 49 శాతా వాటాను విక్రయించింది. 2015లో కార్ల్యేల్ గ్రూప్ నకు మొత్తం వాటాను విక్రయించింది. 

వ్యూహాత్మక ఇన్వెస్టర్ కోసం ఎదురుచూపులు
పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్‌లో వ్యూహాత్మక ఇన్వెస్టర్ కోసం వేచి చూస్తున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సునీల్ మెహతా చెప్పారు. ఇందుకోసం మర్చంటైల్ బ్యాంకర్లను నియమించామన్నారు. పీఎన్బీ హౌసింగ్ సంస్థలో ప్రస్తుతం పీఎన్బీ వాటా 32.36 శాతం, క్వాలిటీ ఇన్వెస్ట్ మెంట్ హోల్డింగ్స్ (కార్ల్యేల్ గ్రూప్)లో 32.36 శాతం వాటా కలిగి ఉంది. బీమా సంస్థ పీఎన్బీ మెట్ లైఫ్ లో 4 శాతం వాటా విక్రయించాలని పీఎన్బీ తలపెట్టింది. పీఎన్బీ మెట్ లైఫ్ సంస్థలోనూ 30 శాం వాటా విక్రయానికి ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్లను పీఎన్బీ నియమించింది. 

ఐసీఐసీఐ బ్యాంక్‌లో రుణాల రద్దు వివాదం 
ఇప్పటికే వీడియోకాన్‌ రుణ కేసుతో  తీవ్ర చిక్కుల్లో పడిన ప్రైవేట్‌ రంగ దిగ్గజ బ్యాంక్‌ ఐసీఐసీఐ మరో వివాదంలో కూరుకున్నది. వీడియోకాన్‌ రుణ కేసు వివాదంతో ఈ బ్యాంక్‌ సీఈవో చందాకొచ్చర్‌ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా రుణాల రైటాఫ్‌ ఇష్యూ తెరపైకి వచ్చింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ మేనేజ్‌మెంట్‌ 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.5000 కోట్ల నుంచి రూ.5600 కోట్ల వరకు అనుమానస్పద కార్పొరేట్‌ రుణాలను రద్దు చేసినట్టు వెల్లడైంది.

టెక్నికల్‌గా ఈ రైటాఫ్‌లు, అకౌంటింగ్‌ పాలసీని మారడం వల్లనే సాధ్యపడుతుందని వార్తలొచ్చాయి. రుణాలను రైటాఫ్‌ చేసేందుకు అకౌంటింగ్‌ పాలసీని మారుస్తూ కొత్త అకౌంటింగ్‌ పాలసీని తీసుకొచ్చేందుకు బ్యాంక్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లు ఆమోదించారని,  ఆ విషయాన్ని బ్యాంక్‌ వాటాదారులకు, ప్రజలకు తెలుపలేదని ఆ వార్తల సారాంశం. ఇది అకౌంటింగ్‌ స్టాండర్డ్‌(ఏఎస్‌) నిబంధనలకు తూట్లు పొడిచినట్టే అవుతుందని తెలిసింది. 

ఐసీఐసీఐ బ్యాంకులో గత లావాదేవీలపైనా విచారణ
వీడియోకాన్‌ రుణ వివాద కేసులో సీఈవో చందా కొచర్‌పై విచారణతో పాటు బ్యాంక్‌ అంతకముందు జరిపిన లావాదేవీలను దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంక్‌ అకౌంటింగ్‌ పాలసీ మార్పు విషయం వెలుగు చూసింది. 2016-2017లో మొండిబకాయిల నిష్పత్తిని తక్కువగా చూపించేందుకు బ్యాంకు కొత్త అకౌంటింగ్‌ పాలసీని తీసుకొచ్చిందని ఆ న్యూస్‌పేపర్‌ వివరించింది. 2017 ఆర్థిక సంవత్సరంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏ)లు 7.89 శాతంగా ఉన్నాయి.

ఒకవేళ కొత్త అకౌంటింగ్‌ పాలసీ తేకుంటే మొండి బాకీలు 8.5 శాతానికి పైన ఉండేవని పేర్కొంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ స్టాక్లో పెట్టుబడి పెట్టాలన్నా, డిస్‌ఇన్వెస్టింగ్‌ చేయాలన్నా ప్రజలకు, వాటాదారులకు తెలుపాల్సిన బాధ్యత బ్యాంక్‌ బోర్డుపై ఉందని ఒక అధికారి అన్నారు. కానీ ఐసీఐసీఐ బ్యాంక్‌ 2017 ఏప్రిల్‌ 7న ఆమోదించిన కొత్త అకౌంటింగ్‌ పాలసీపై ఎవరికి తెలుపలేదని వెల్లడించారు. చందా కొచ్చర్‌ కేవలం రైటాఫ్‌ విషయాన్ని మాత్రమే 2017 ఏప్రిల్‌ 7న జరిగిన బోర్డు మీటింగ్‌ నోట్‌లో పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios