ప్రధాని మోదీ కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా రూ.6000 పొందాలంటే e-KYCని తప్పనిసరి చేసింది. ఈ పని కనుక చేయకపోతే వెంటనే చేసేయండి లేకపోతే చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. 

PM kisan Samman Nidhi: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద, మోడీ ప్రభుత్వం నేరుగా దేశంలోని రైతుల ఖాతాలకు సంవత్సరానికి 6,000 బదిలీ చేస్తుంది. ఈ డబ్బును ప్రభుత్వం మూడు విడతలుగా రైతులకు విడుదల చేస్తుంది. ప్రతి విడతలో రైతులకు రూ.2వేలు అందజేస్తున్నారు. త్వరలోనే ఏప్రిల్‌లో మరోవిడత డబ్బులు విడుదల కానున్నాయి. తదుపరి విడత డబ్బులు పొందడానికి, మీరు ఈ పనిని త్వరగా చేయాలి.

ప్రధానమంత్రి కిసాన్ యోజన 2021లో కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. దీని ప్రకారం రైతులు ఇప్పుడు 11వ విడత కోసం ఇ-కెవైసిని (e-KYC) పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు 11వ విడతకు సంబంధించి అనేక కొత్త నిబంధనలతో రైతులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

చేయాల్సిన పని ఇదే..
PM కిసాన్ యోజన కింద, మీరు e-KYCని పూర్తి చేసినప్పుడు మాత్రమే రైతులు తదుపరి వాయిదా అంటే 11వ వాయిదా డబ్బు ( 11th Installment Money) పొందే వీలుంది. e-KYC లేకుండా మీ ఇన్‌స్టాల్‌మెంట్ నిలిచిపోవచ్చు. మీరు ఇంట్లో కూర్చొని e-KYC చేయవచ్చు.

దీని కోసం, PM కిసాన్ పోర్టల్ https://pmkisan.gov.in/ని సందర్శించండి.

ఇక్కడ మీరు మొదట eKYC లింక్‌ను కనిపిస్తుంది, లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత, మీ ఆధార్ నంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది.

ఇక్కడ మీ ఆధార్ నంబర్ మరియు ఇమేజ్ కోడ్‌ని నమోదు చేసి, సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయండి. దీని తర్వాత మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, మీరు ఆధార్‌తో లింక్ చేసిన అదే నంబర్‌ను నమోదు చేయాలి.

ఆ తర్వాత OTPని నమోదు చేయండి. దీని తర్వాత మీ e-KYC పూర్తవుతుంది. e-KYCని పూర్తి చేయడంలో మీకు ఏదైనా సమస్య ఎదురైతే, మీరు ఆధార్ సేవా కేంద్రాన్ని సంప్రదించవచ్చు.

11వ విడత త్వరలో విడుదల కానుంది.
మీడియా నివేదికల ప్రకారం, PM కిసాన్ యోజన కోసం 11వ విడత ఏప్రిల్ మొదటి వారంలో రైతుల ఖాతాకు బదిలీ చేయనున్నారు. లబ్దిదారుడు నిర్ణీత సమయానికి ముందు జాబితాలో మీ పేరును తనిఖీ చేయాలి.