Asianet News TeluguAsianet News Telugu

Plot vs flat: సొంతిల్లు కోసం మీ బడ్జెట్ లో అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ కొంటే బెటరా...ఓపెన్ ప్లాట్ కొంటే బెటరా..

ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలా, ? లేక ఓపెన్ ప్లాటు కొని ఇల్లు నిర్మించాలా తెలియడం లేదా....రెండింటిలో ఏది బెటర్ ఆప్షనో తేల్చుకోలేకపోతున్నారా..  అపార్ట్మెంట్ ఫ్లాట్ విషయంలో మీకున్న సందేహాలను సైతం  తీర్చుకునేందుకు పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

 

Plot vs flat Is it better if you buy a flat in an apartment or buy an open plot MKA
Author
First Published May 23, 2023, 2:47 AM IST

చాలామంది రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపడానికి ప్రధాన కారణం ఆ రంగంలో సాధించే రిటర్న్ మాత్రమే అని చెప్పవచ్చు.  ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో రిటర్న్స్ చాలా ఎక్కువగా ఉంటాయి దీంతో ప్రతి ఒక్కరు ఎంతో కొంత భూమి కొనుగోలు చేయాలని తాపత్రయపడుతూ  ఉంటారు.  తద్వారా భవిష్యత్తులో తాము ఇల్లు కట్టుకునే వీలు ఉంటుందని లేదా ఆ భూమిని విక్రయించి మరింత లాభం పొందవచ్చు అని ప్లాన్ చేస్తూ ఉంటారు.  అయితే ప్రస్తుతం భూముల ధరను భారీగా పెరిగిపోయాయి.  హైదరాబాద్ వంటి నగరాల్లో ఒక గజం స్థలం విలువ దాదాపు లక్ష రూపాయలకు చేరిందంటే అతిశయోక్తి కాదేమో.   అయితే  చాలా మంది అదే ఇండ్లలో ఉండే బదులు సొంత ఇల్లు నిర్మించుకోవాలని కలలు కంటూ ఉంటారు. 

అయితే పెరిగిన భూముల రేట్ల నేపథ్యంలో ఇండిపెండెంట్ ఇల్లు కొనడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని కోట్లల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది.  ఈ నేపథ్యంలో అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేస్తే తక్కువ ధరకే మంచి నివాసయోగ్యమైన,  ఇతర సదుపాయాలతో కూడిన ఇల్లు సొంతం అవుతుందని చాలామంది భావిస్తూ ఉంటారు.  అయితే మరి కొందరు మాత్రం అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది గాలిలో పెట్టుబడి లాంటిదని అది ఎప్పటికీ మన సొంతం కాదు అని.  మన పెట్టుబడి నష్టపోతున్నామని భవిష్యత్తులో అపార్ట్మెంట్ కూలిపోతుందేమోనని,  అప్పుడు మన గత ఏమవుతుందని పెట్టుబడి అంతా బూడిదలు పోసిన పన్నీరు అవుతుందని  అపోహలతో ఉంటారు.  దీంతో ఎప్పటికైనా ఇండిపెండెంట్ ఇల్లు కొనుగోలు చేయాలని సొంత ఇంటి కలను వాయిదా వేస్తూ ఉంటారు మరోవైపు భూముల ధరలు మాత్రం సంవత్సరం తిరిగే కొద్ది రెండింతలు మూడింతలు పెరుగుతూ ఉంటాయి. అప్పుడు మీరు ఇల్లు కొనుగోలు చేసుకోవాలని కల కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. 

అపార్ట్మెంట్లో ఫ్లాట్ పై పెట్టుబడి పెట్టడం నిజంగానే నష్టమా.  భూమి మీద ఒక ప్లాట్ లో పెట్టుబడి పెడితే లాభమా రెండింటిలో ఏది బెటరు 

ఓపెన్ ప్లాటు కొనుగోలు చేయడం వల్ల లాభాలు: 

 ఖాళీ స్థలం లేదా జాగాను ప్లాట్ అంటారు సాధారణంగా ప్లాటు పరిమాణం 100 గజాల నుంచి ప్రారంభమవుతుంది.  గరిష్టంగా 1000 గజాల వరకు ప్లాట్లను కొనుగోలు చేస్తూ ఉంటారు.  అయితే ఫ్లాట్ ఖరీదు అనేది ఆ స్థలాన్ని బట్టి ఉంటుంది ఉదాహరణకు మంచి డెవలపింగ్ ఏరియా అయినట్టయితే ప్లాటు ఖరీదు ఎక్కువగా ఉంటుంది.  గజం లెక్కన ఖరీదు చేసి ప్లాట్లను కొనుగోలు చేస్తూ ఉంటారు.  మీరు కొనుగోలు చేసిన ప్లాట్ లొకాలిటీ మంచి డెవలప్మెంట్ సాధించినట్లయితే మీ ఫ్లాట్ ధర కూడా భవిష్యత్తులో మంచి ధర అందుకునే అవకాశం ఉంటుంది.  వీలైతే మీరు భవిష్యత్తులో అక్కడ మంచి ఇల్లు నిర్మించుకొని మీ కలను సాకారం చేసుకోవచ్చు. 

ఓపెన్ ప్లాటు కొనుగోలు చేయడం వల్ల కలిగే ఇబ్బందులు..

ఉదాహరణకు మీరు కొనుగోలు చేసిన ఓపెన్ ప్లాట్ ప్రాంతం భవిష్యత్తులో అభివృద్ధి చెందకపోతే మీ పెట్టుబడి వృధా అయ్యే ప్రమాదం ఉంటుంది.  అలాగే ఓపెన్ ప్లాట్స్ అనేది రిస్క్ తో కూడినవి వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ లోన్ తీసుకొని మాత్రం కొనకూడదు.  ఎందుకంటే వీటిపై ఎలాంటి అద్దె ఆదాయము మీకు లభించదు.  ఒక్కోసారి ఓపెన్ ప్లాటు డెవలప్ అయ్యేందుకు పది సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు కూడా పడుతూ ఉంటుంది.  మీకు తక్షణమే డబ్బు కావాలంటే ప్లాటును విక్రయించాల్సి ఉంటుంది. అప్పుడు ఆ ప్లాటుకు సరైన ధర లభించకపోతే మీరు నష్టపోయే ప్రమాదం ఉంది. దీంతోపాటు ప్లాటు కొనుగోలు చేసే ముందు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయంలో కాగితాలన్నీ సరిగ్గా చూసుకోవాలి ఒక్కోసారి ప్రభుత్వ భూములను సైతం కొందరు  మోసగాళ్లు మనకు అంటగడుతూ ఉంటారు అలాంటప్పుడు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది.

అపార్ట్మెంట్లో ఫ్లాట్ వల్ల లాభాలు: 

అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేయడం వల్ల మీరు వెంటనే ఆ ఇంట్లో నివసించే అవకాశం లభిస్తుంది.  గేటెడ్ కమ్యూనిటీ కావడం వల్ల మీకు ఒకే చోట అన్ని రకాల సదుపాయాలు లభిస్తాయి.  అదేవిధంగా నిర్మించిన కట్టడం రావడంతో మీరు ప్రత్యేకంగా నిర్మాణం కోసం పెట్టుబడి పెట్టాల్సిన పనిలేదు.  అలాగే మంచి ప్రైమ్ లొకేషన్ లో కూడా మీరు తక్కువ ధరలోనే ఫ్లాట్లను కొనుగోలు చేసుకోవచ్చు.  అలాగే మీరు అపార్ట్మెంట్ ఫ్లాట్ మీద పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తులో అధిక ధరలను కూడా పొందే వీలుంది.  అంతే కాదు ప్లాట్ ను రెంటుకి ఇస్తే ప్రతి నెల ఆదాయం కూడా లభిస్తుంది.  అపార్ట్మెంట్ ప్లాట్లను కొనుగోలు చేసేందుకు అన్ని ప్రముఖ బ్యాంకులు  సులభ వాయిదాలపై లోన్లను ఇస్తాయి. 

లోన్ తీసుకొని అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనడం చాలా లాభదాయకం ఎలాగో తెలుసుకోండి..

>>  ఉదాహరణకు మీరు ఒక ప్లాట్ ను 20 లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు అనుకుందాం.  అందుకుగాను మీరు 15 లక్షల రూపాయలు రుణం పొందారు అనుకుందాం.  హోమ్ లోన్ వడ్డీ సుమారు 8.5% అనుకుంటే  20 సంవత్సరాలకు గాను మీరు ప్రతి నెల 13వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.  అంటే మీరు ఒక మంచి లొకాలిటీలో చెల్లించే అద్దెతో సమానం.  

>> అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది.  మీరు ప్రతి నెల చెల్లించే అద్దె ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది.  ఉదాహరణకు ఈ సంవత్సరం చెల్లించిన అద్దె పది సంవత్సరాల తర్వాత చాలా రెట్లు పెరుగుతుంది.  ఎన్ని సంవత్సరాలైనా అద్దె ఇల్లు మీ సొంతం కాదు.  అదే మీరు లోన్ తీసుకొని అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేస్తే ప్రతి నెల చెల్లించే ఈఎంఐ  మీరు చివరి నెల ఈఎంఐ చెల్లించే వరకు ఒక్క రూపాయి కూడా పెరగదు.  

>> అంతేకాదు మీరు చెల్లించే ఈఎంఐ ద్రవ్యోల్బణంతో లెక్కకట్టి చూస్తే, ప్రతి ఏడాది పెరిగే కొద్దీ మీరు చెల్లించాల్సిన ఈఎంఐ మొత్తం పెద్దగా భారం అనిపించదు.  ఎందుకంటే మొదటి సంవత్సరం మీరు ప్రతి నెల 13 వేల రూపాయలు ఈఎంఐ చెల్లిస్తే,  20 సంవత్సరాల తర్వాత చివరి నెల ఈఎంఐ చెల్లించే నాటికి ఆ 13 మొత్తం మీకు ఏ మాత్రం భారం అనిపించదు.  ఎందుకంటే ఈ 20 సంవత్సరాల్లో మీ వేతనం చాలా రెట్లు పెరిగే అవకాశం ఉంది మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది.  అప్పుడు మీరు చెల్లించే 13,000 రూపాయల ఈఎంఐ  చాలా తక్కువగా అనిపిస్తుంది.  ఇలా హోమ్ లోన్ తీసుకొని అపార్ట్మెంట్ కొనడం ద్వారా భారీగా లాభపడే అవకాశం లభిస్తుంది. . అంతేకాదు 20 సంవత్సరాల తర్వాత మీరు తిరిగి చూసినట్టయితే అపార్ట్మెంట్ ఫ్లాట్ విలువ కూడా చాలా రేట్లు పెరిగి ఉంటుంది.  మీరు 20 లక్షలు పెట్టుబడి దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఐదు నుంచి పది రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. 

భవిష్యత్తులో అపార్ట్మెంట్ కూలిపోతే ఏంటి పరిస్థితి ? తట్టా బుట్టా సర్దుకోవాల్సిందేనా..

ఈ సందేహం కలగడం అందరికీ సహజమే. ఉదాహరణకు మీరు ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేస్తే ఆ బిల్డింగ్ నిర్మించిన స్థలం పై కూడా మీకు  హక్కు ఉంటుందన్న సంగతి గుర్తుంచుకోవాలి. దీన్నే Undivided Share of land అని అంటారు. మీరు అపార్ట్ మెంట్ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీకు దక్కిన భూమి వాటాకు కూడా రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేస్తారు. దీని అర్థం మీరు ఉంటున్న అపార్ట్మెంట్ భూమిలో కొంత వాటా మీకు ఇస్తారు.

Undivided Share of land ఎలా లెక్కిస్తారు..

ఉదాహరణకు మీ అపార్ట్మెంట్ నిర్మించిన స్థలం  ఓ 4000 గజాలు ఉంది అనుకుందాం. ఇందులో మొత్తం దాదాపు 200 వందల ప్లాట్లు నిర్మించారనుకుందాం. అందులో మీరు 1000 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ కొనుగోలు చేసినట్లయితే, మీ అపార్ట్మెంట్ పూర్తి స్థలాన్ని అందులోని 200 ఫ్లాట్లతో విభజించాలి. అప్పుడు మీకు అన్ డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ కింద ఎంత వాటా లభిస్తుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. 

ప్రస్తుతం హైదరాబాదు లాంటి మహానగరంలో భూముల రేటుతో పోల్చి చూసినట్లయితే, మీరు అపార్ట్మెంట్ ప్లాటు కొన్న ప్రారంభ ధరతో, ఓ 50 సంవత్సరాల తర్వాత ప్రస్తుతం మీ అపార్ట్ మెంటు ఉన్న భూమి వాటా విలువను పోల్చి చూసినట్లయితే మీరు ఎన్నో రెట్లు లాభ పడ్డట్టు గమనించవచ్చు. 

అందుకే ప్రస్తుతం నగరాల్లో సొంతింటి కల కోసం ఎదురుచూస్తున్న వారికి అపార్ట్మెంట్ ఫ్లాట్లు  అయితే  చక్కటి ఆప్షన్ గా పెట్టుబడికి కూడా మంచి ఆప్షన్ గా నిలుస్తున్నాయి.  అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios