న్యూ ఢీల్లీ: భారతదేశంలో పెట్రోల్ ధరలు ఆల్ టైం హై గరిష్ట స్థాయిని దాటనున్నాయి, తాజాగా ఢీల్లీలో పెట్రోల్ ధర లీటరుకు బుధవారం రూ.83.97 వద్దకు చేరింది. గత 29 రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్ ధరలు బుధవారం లీటరుకు 26 పైసలు పెరిగింది.

డీజిల్ ధర కూడా లీటరుకు 25 పైసలు పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరుకు రూ.74.12గా ఉంది. అలాగే ఇండోర్‌లో డీజిల్ ధర లీటరుకు రూ .82.05, పెట్రోల్ ధర లీటరుకు రూ .91.85.

  వరుసగా 29 రోజులు ధరలు స్థిరంగా ఉండటంతో పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు కనిపించింది. నేడు డీజిల్ ధర 25 - 27 పైసలకు పెరగగా, పెట్రోల్ ధర కూడా 24 పైసల నుంచి 26 పైసలకు పెరిగింది. 

also read కొంపముంచిన ఫార్చ్యూన్‌ ఆయిల్.. గంగూలీకి గుండెపోటుతో యాడ్‌ నిలిపివేత.. ...


ఢీల్లీ పెట్రోల్ ధర రూ.74.12, డీజిల్ ధర రూ.83.97

 కోల్‌కతా పెట్రోల్ ధర రూ.77.70, డీజిల్ ధర రూ.85.44

 ముంబై పెట్రోల్ ధర రూ.80.78, డీజిల్ ధర రూ.90.60 

చెన్నై పెట్రోల్ ధర రూ.79.46, డీజిల్ ధర రూ.86.75

కరోనా టీకా, కరోనావైరస్ మహమ్మారి ప్రపంచ ఇంధన డిమాండ్‌ను ప్రభావితం చేయడంతో అంతర్జాతీయ ముడి చమురు ధరలలో పెంపు చోటుచేసుకుంది. ప్రస్తుతం వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ లో బ్రెంట్ బ్యారెల్కు 53.86 డాలర్ల వద్ద ట్రేడవుతుంది.

"చమురు కంపెనీలు ఇంధన రిటైల్ ధరలను కొంతకాలంగా స్థిరంగా ఉంచడంతో తాజాగా ఇంధన ధరలను సవరించింది"అని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.ఢీల్లీలో 4 అక్టోబర్ 2018న పెట్రోల్ ఆల్-టైమ్ గరిష్ట ధర లీటరుకు రూ.84 కు చేరుకుంది. తరువాత ఈ ఏడాది జూలై 30న డీజిల్ గరిష్ట ధర లీటరుకు. 81.94గా చేరింది.

ముడి చమురు ఉత్పత్తిని జనవరి నుండి రోజుకు 500,000 బారెల్స్ పెంచాలని, క్రమంగా 2mb / d ను ప్రపంచ మార్కెట్‌కు తిరిగి ఇవ్వాలని ఒపెక్-ప్లస్ డిసెంబర్ నిర్ణయించింది. ముడి చమురు దిగుమతుల కోసం 2019-20లో భారత్ 101.4 బిలియన్ డాలర్లు, 2018-19లో 111.9 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.

పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలతో పాటు విదేశీ మారక ద్రవ్యాల రేటును బట్టి ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. ఈ ప్రమాణాల ఆధారంగా చమురు కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్ రేటు మరియు డీజిల్ రేటును నిర్ణయిస్తాయి. పన్నులు, వారి స్వంత మార్జిన్లను జోడించిన తరువాత రిటైల్ ధరలకు  ఇంధనాన్ని వినియోగదారులకు విక్రయిస్తారు.