భారత మాజీ కెప్టెన్, బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి స్వల్ప గుండెపోటు వచ్చిన మూడు రోజుల తరువాత, అదానీ విల్మార్  ఫార్చ్యూన్ రైస్ బ్రాన్ వంట నూనె ప్రకటనలను నిలిపివేసింది.

 ఫార్చ్యూన్ రైస్ బ్రాన్ ఆయిల్ గుండెకు ఆరోగ్యకరమైనదని పేర్కొంటూ చేసిన కంపెనీ ప్రకటనను ఎగతాళి చేస్తూ సోషల్ మీడియా వినియోగదారులు విమర్శలతో భారీగా ట్రోల్‌ చేస్తున్నారు. 

భారత మాజీ క్రికెట్ స్టార్ సౌరవ్ గంగూలీ జనవరి 2020లో ఫార్చ్యూన్ రైస్ బ్రాన్ వంట నూనె బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. లాక్ డౌన్ సమయంలో ఓగిల్వి & మాథర్ అనే ఏజెన్సీ బ్రాండ్ ప్రచారం రూపొందించింది,  ఇందులో ఫార్చ్యూన్ ఆయిల్ గుండెకు ఆరోగ్యకరమైనదని ప్రోత్సహించింది.

అదానీ విల్మార్ ఫార్చ్యూన్ బ్రాండ్‌ను సమర్థిస్తు, ఈ ఆయిల్ ఆరోగ్యకరమైనదని భవిష్యత్తులో సౌరవ్‌తో కలిసి పనిచేయడం కొనసాగిస్తామని అన్నారు. వాణిజ్య ప్రకటనల నుండి తాత్కాలిక విరామం తీసుకున్నామని, త్వరలో మళ్ళీ తిరిగి వస్తామని అదానీ విల్మార్ తెలిపారు.

"మా ఆయిల్ సహజ యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. రైస్ బ్రాన్ నూనెలో ఉన్న గామా ఒరిజోనల్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది, లిపిడ్ ప్రొఫైల్ను మెరుగుపరుస్తుంది. రైస్ బ్రాన్ నూనె ఒక ఔషధం కాదు, వంట నూనె మాత్రమే. గుండె జబ్బులను ప్రభావితం చేసే అనేక అంశాలలో ఆహారం, వంశపారంపర్య సమస్యలతో సహా చాలా ఉన్నాయి.

also read రహస్యంగా గూగుల్ ఉద్యోగుల యూనియన్‌ ఏర్పాటు.. వాటికి వ్యతిరేకంగా పోరాడటానికి అంటూ వెల్లడి.. ...

మేము సౌరవ్‌తో కలిసి పనిచేయడం కొనసాగిస్తాము అలాగే అతను మా బ్రాండ్ అంబాసిడర్‌గా తను కొనసాగుతాడు. మేము మళ్ళీ సౌరవ్‌తో ముందుకు సాగే వరకు మా టీవీ వాణిజ్య ప్రకటనలలో తాత్కాలిక విరామం మాత్రమే తీసుకున్నాము. ఇది చాలా దురదృష్టకర సంఘటన"అని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

కోల్‌కతాలోని తన ఇంట్లో జిమ్‌లో ఉన్నప్పుడు క్రికెటర్ గంగూలీ గుండెపోటుకి గురవడంతో గత వారం శనివారం మధ్యాహ్నం 1:00 గంటలకు ఆసుపత్రికి తరలించారు.

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బిసిసిఐ) అధ్యక్షుడు గంగూలీ ఇప్పుడు స్థిరంగా ఉన్నారని, త్వరలో డిశ్చార్జ్ అవుతారని కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ హాస్పిటల్ సోమవారం తెలిపింది. గంగూలీ ఒక స్టెంట్ వేసామని, శస్త్రచికిత్స తరువాత స్థిరంగా ఉన్నట్లు చెప్పారు.

చాలా మంది బ్రాండింగ్ ఉత్పత్తులను తెలివిగా ఎంచుకోవాలని సౌరవ్‌ను సూచిస్తూ, గంగూలీ యాడ్ తర్వాత ప్రజలు తెలివిగా ఉండాలని మరికొందరు కోరారు.

భారత మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ కూడా "దాదా త్వరగా కోలుకోవాలి. ఎపుడూ పరీక్షించిన, ప్రయత్నించిన ఉత్పత్తులను మాత్రమే ప్రోత్సహించాలి. జాగ్రత్తగా ఉండండి.. గాడ్‌ బ్లెస్ యు‌’’ అంటూ ట్వీట్ చేశారు.