నేటికీ తగ్గని ఇంధన ధరలు.. మీ నగరంలో లీటరు పెట్రోల్ డీజిల్ ధర ఎంతో తెలుసుకోండి...

రాజస్థాన్‌లో పెట్రోల్ 66 పైసలు, డీజిల్ 59 పైసలు తగ్గగా  , మహారాష్ట్రలో పెట్రోల్ ధర 65 పైసలు , డీజిల్ ధర 62 పైసలు తగ్గింది .  మరోవైపు గుజరాత్‌లో పెట్రోల్ ధర 47 పైసలు, డీజిల్ 49 పైసలు పెరిగింది. 

Petrol Price Today: Increase in price of petrol and diesel in Kerala, oil prices decreased in these states including Rajasthan-sak

నేడు అంతర్జాతీయ మార్కెట్‌లో మరోసారి ముడిచమురు ధరల్లో స్వల్ప తగ్గుదల చోటు చేసుకుంది.  దీని ప్రభావం భారత్‌లో చమురు ధరలపై పెద్దగా పడలేదు. గత ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా ఇంధన ధరలు ఒకే విధంగా ఉన్నాయి. జూన్ 26 న WTI క్రూడ్ బ్యారెల్‌కు $ 0.63 పెరిగి $ 69.16 వద్ద చేరగా,  బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు $ 0.70 లాభంతో $ 74.55 వద్ద ట్రేడవుతోంది .  దేశవ్యాప్తంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు జూన్ 26వ తేదీకి పెట్రోల్, డీజిల్ తాజా రేట్లను విడుదల చేశాయి. దింతో చాలా నగరాల్లో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో చమురు ధరలు స్వల్పంగా పెరిగాయి.

రాజస్థాన్‌లో పెట్రోల్ 66 పైసలు, డీజిల్ 59 పైసలు తగ్గగా  , మహారాష్ట్రలో పెట్రోల్ ధర 65 పైసలు , డీజిల్ ధర 62 పైసలు తగ్గింది .  మరోవైపు గుజరాత్‌లో పెట్రోల్ ధర 47 పైసలు, డీజిల్ 49 పైసలు పెరిగింది.  హిమాచల్ ప్రదేశ్‌లో కూడా పెట్రోల్ ధర 32 పైసలు, డీజిల్ ధర 28 పైసలు పెరిగింది .  కేరళ, జార్ఖండ్‌లలో కూడా పెట్రోల్ , డీజిల్ ధరలు పెరిగాయి .

 మహానగరాల్లో పెట్రోలు , డీజిల్ ధరలు

 ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ .96.72 , డీజిల్ ధర రూ .89.62

ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ .106.31 , డీజిల్ ధర రూ .94.27

 కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ .106.03 , డీజిల్ ధర రూ .92.76

 చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ .102.63 , డీజిల్ ధర రూ .94.24

ఈ నగరాల్లోనూ కొత్త రేట్లు

నోయిడాలో లీటర్  పెట్రోల్ ధర రూ .96.92 , డీజిల్ ధర రూ .90.08

ఘజియాబాద్‌లో పెట్రోల్ ధర రూ .96.34 , డీజిల్ లీటరు  ధర రూ .89.52

లక్నోలో లీటర్  పెట్రోల్ ధర రూ .96.74 , డీజిల్ ధర రూ .89.93

పాట్నాలో లీటర్  పెట్రోల్ ధర రూ .107.24 , డీజిల్ ధర రూ .94.04

పోర్ట్ బ్లెయిర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ .84.10 , డీజిల్ ధర రూ .79.74

హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82

అలాగే  పెట్రోల్ డీజిల్ ధరలను SMS ద్వారా తెలుసుకోవచ్చు. ప్రతిరోజూ అప్‌డేట్ అయ్యే ధరలను తెలుసుకోవాలంటే, మీరు చేయాల్సిందల్లా  ఇండియన్ ఆయిల్ కస్టమర్ RSP అండ్ మీ సిటీ కోడ్‌ని 9224992249కి sms పంపండి. మరోవైపు, BPCL వినియోగదారులు RSP, వారి సిటీ కోడ్‌ని టైప్ చేయడం ద్వారా 9223112222కు SMS పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. మీరు HPPCL వినియోగదారులు అయితే, మీరు HPPrice ఇంకా మీ సిటీ కోడ్‌ని 9222201122కి sms పంపడం ద్వారా ధరలను తెలుసుకోవచ్చు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios