Asianet News TeluguAsianet News Telugu

నేడు మళ్లీ ఎగిసిన క్రూడాయిల్.. పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం.. ఈ రాష్ట్రాల్లో కొత్త ధరలు..

గ్లోబల్ మార్కెట్‌లో శుక్రవారం క్రూడాయిల్ ధరల్లో పెరుగుదల కనిపించింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 1.18 డాలర్లు (1.39%) పెరిగి 86.16 డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో, WTI $0.47 (0.59%) లాభంతో బ్యారెల్‌కు $ 80.80 డాలర్ల వద్ద విక్రయిస్తోంది.

Petrol Diesel Rates Today on 20 January: Fuel prices unchanged Check rates in your cities here
Author
First Published Jan 20, 2023, 9:17 AM IST

నేడు పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 244వ రోజు శుక్రవారం అంటే జనవరి 20న మారలేదు.  గత ఏడాది మే 21న కేంద్ర ప్రభుత్వం  పెట్రోల్‌పై లీటరుకు రూ. 8, డీజిల్‌పై రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తర్వాత దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు చివరిసారిగా తగ్గాయి. తరువాత, మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం జూలై 14, 2022న పెట్రోల్ పై రూ. 5, డీజిల్‌పై రూ. 3  చొప్పున విలువ ఆధారిత పన్ను ( వ్యాట్ ) తగ్గించిన తర్వాత ఇంధన ధరలు దిగోచ్చాయి.

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31గా ఉండగా, డీజిల్ ధర రూ.94.27గా ఉంది.

కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.03, లీటర్ డీజిల్ ధర రూ.92.76. కాగా, చెన్నైలో పెట్రోల్ ధరలు రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉన్నాయి. బెంగళూరులో పెట్రోల్ ధర రూ. 101.94, డీజిల్ ధర రూ. 87.89.

గ్లోబల్ మార్కెట్‌లో శుక్రవారం క్రూడాయిల్ ధరల్లో పెరుగుదల కనిపించింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 1.18 డాలర్లు (1.39%) పెరిగి 86.16 డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో, WTI $0.47 (0.59%) లాభంతో బ్యారెల్‌కు $ 80.80 డాలర్ల వద్ద విక్రయిస్తోంది.

బెంగళూరు పెట్రోల్ ధర  రూ.101.94, లీటరు డీజిల్ ధర రూ.87.89

లక్నో పెట్రోల్ ధర  రూ.96.57, లీటరు డీజిల్ ధర రూ.89.76

విశాఖపట్నం పెట్రోల్ ధర  రూ.110.48, లీటరు డీజిల్ ధర రూ.98.27

అహ్మదాబాద్ పెట్రోల్ ధర  రూ.96.63, లీటరు డీజిల్ ధర రూ.92.38

హైదరాబాద్ పెట్రోల్ ధర  రూ.109.66, లీటరు డీజిల్ ధర రూ.97.82

పాట్నా పెట్రోల్ ధర  రూ.107.24, లీటరు డీజిల్ ధర రూ.94.04

దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు స్థానిక పన్నుల బట్టి రాష్ట్రానికి  నుండి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి.

ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ విదేశీ మారకపు రేట్లు, అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలకు అనుగుణంగా ఇంధన ధరలను సవరిస్తాయి.

Follow Us:
Download App:
  • android
  • ios