Asianet News TeluguAsianet News Telugu

మళ్ళి పెరుగుతున్న క్రూడాయిల్.. ఈ వేసవిలో పెట్రోల్, డీజిల్ తగ్గేనా.. నేటి ధరలు ఇవే..

గత ఏడాది మే 21న దేశ వ్యాప్తంగా ఇంధన ధరల్లో చివరి మార్పు జరిగింది, అప్పట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. మే 2022లో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటి నుండి, కొన్ని రాష్ట్రాలు ఇంధనాలపై వ్యాట్ ధరలను తగ్గించగా, కొన్ని పెట్రోల్, డీజిల్‌పై సెస్ విధించాయి.

Petrol Diesel Rate Today, 24 May: Some cities see revision; Check rates in Delhi, Mumbai, other cities-sak
Author
First Published May 24, 2023, 8:28 AM IST

నేడు బుధవారం మే 24న న్యూఢిల్లీ, కోల్‌కతా, ముంబై ఇంకా చెన్నైలో  ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. గత పన్నెండు నెలలుగా పెట్రోలు, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు లేదు. అయితే ఒక్కొక్క నగరాలలో ప్రతిరోజూ వీటి ధరలలో హెచ్చుతగ్గులను చూస్తాయి. ఇంకా పెట్రోల్  డీజిల్ ధరలు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి, వాల్యూ  ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వివిధ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది.

గత ఏడాది మే 21న దేశ వ్యాప్తంగా ఇంధన ధరల్లో చివరి మార్పు జరిగింది, అప్పట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. మే 2022లో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటి నుండి, కొన్ని రాష్ట్రాలు ఇంధనాలపై వ్యాట్ ధరలను తగ్గించగా, కొన్ని పెట్రోల్, డీజిల్‌పై సెస్ విధించాయి.

బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0007 GMT నాటికి 86 సెంట్లు లేదా 1.1% పెరిగి బ్యారెల్‌కు $77.70కి చేరుకుంది, అయితే US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ (WTI) 88 సెంట్లు లేదా 1.2% పెరిగి బ్యారెల్‌కు $73.79కి చేరుకుంది.

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉండగా, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో, పెట్రోలు ధర లీటరుకు రూ. 106.31, డీజిల్ ధర లీటరుకు రూ. 94.27గా ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర లీటరుకు రూ.92.76. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63కు లభిస్తుండగా, డీజిల్ ధర లీటరుకు రూ.94.24కే లభిస్తోంది. ఇతర నగరాల్లో ఇంధన ధరలను ఇలా ఉన్నాయి:

బెంగళూరు:  పెట్రోలు ధర: లీటరుకు రూ. 101.94, డీజిల్ ధర: రూ. 87.89

చండీగఢ్:  పెట్రోలు ధర: లీటరుకు రూ. 96.20, డీజిల్ ధర: రూ. 84.26 

గురుగ్రామ్:  పెట్రోల్ ధర: లీటరుకు రూ. 97.04, డీజిల్ ధర: రూ. 89.91
 
లక్నో:  పెట్రోల్ ధర: లీటరుకు రూ. 96.57, డీజిల్ ధర: రూ. 89.76
 
నోయిడా:  పెట్రోలు ధర: లీటరుకు రూ. 96.65, డీజిల్ ధర: రూ. 89.82

హైదరాబాద్ (తెలంగాణ)లో ఈరోజు పెట్రోల్ ధర రూ. లీటరుకు 109.66.   డీజిల్ ధర రూ. 97.82 లీటరుకి.
 
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సహా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు,  ఫారెక్స్ రేట్లకు అనుగుణంగా ప్రతిరోజూ  పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి అమలు చేయబడతాయి.  

Follow Us:
Download App:
  • android
  • ios