వరుసగా 8 నెలలుగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు. దీంతో వాహనదారులకు ఊరట కలుగుతోంది. అయితే త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పరిశీలిస్తున్నట్లు ప్రకటించడంతో వాహనదారుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వరుసగా 8 నెలలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచకుండా స్థిరంగా ఉంచుతుంది దీంతో వాహనదారులకు ఊరట కలిగిస్తోంది. అయితే తాజాగా పెట్రోల్ డీజిల్ ధరలను జిఎస్టి కిందకు తెస్తామని ఎందుకు రాష్ట్రాల అభిప్రాయాలను సైతం తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించడంతో వాహనదారులకు శుభవార్త వినిపించింది. జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ వచ్చినట్లయితే భారీగా ధరలు తగ్గే అవకాశం ఉందని, నిపుణులు చెబుతున్నారు. ఇంధన ధరలు 16 ఫిబ్రవరి 2023 గురువారం నాడు స్థిరంగా కొనసాగాయి, దాదాపు ఎనిమిది నెలల పాటు ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో పెట్రోలు ధర రూ.96.72గా ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.89.62గా ఉంది. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. పెట్రోల్ మరియు డీజిల్ ధరలు రాష్ట్రాల వారీగా మారుతాయి, విలువ ఆధారిత పన్ను (VAT), సరకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వివిధ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. గత ఏడాది మే 21న ఫైనాన్స్ సమయంలో ఇంధన ధరలలో చివరిసారిగా దేశవ్యాప్త మార్పు జరిగింది. పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని మంత్రి నిర్మలా సీతారామన్ తగ్గించారు.
ఈరోజు హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ. 109.66 / లీటర్, డీజిల్ ధర రూ. 97.82 /లీటరుగా ఉంది. మరోవైపు అంతర్జాతీయంగా గమనించినట్లయితే క్రూడ్ ఆయిల్ ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి బ్రెడ్ కూడా ధర బేరల్ కు 5 డాలర్ల చొప్పున తగ్గుముఖం పట్టింది దీంతో అంతర్జాతీయంగా కూడా చమురు ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే భారత దేశంలో స్థానిక పన్నులు కేంద్ర పన్నులు స్థానిక పన్నులు కారణంగా పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా ఉంటాయి. రాష్ట్రాలు కేంద్రము సెస్సుల రూపంలో పెట్రోల్ డీజిల్ పై పన్ను వసూలు చేస్తుంటాయి అందుకే పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయి.
