ప్రపంచంలోనే అత్యధికంగా ముడి చమురును దిగుమతి చేసుకునే దేశం చైనా. చైనాలో ఆర్థిక వృద్ధి మందగించవచ్చన్న భయాలు ముడి చమురు డిమాండ్ పై పెట్టుబడిదారుల ఆందోళనలను మరోసారి లేవనెత్తాయి.

న్యూఢిల్లీ: ఇండియాలో నేటికీ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నవంబర్ 1 నుంచి ఇంధన ధరలు తగ్గుతాయని సోమవారం సాయంత్రం నుంచి ప్రచారం జరుగుతోంది. పెట్రోలు 40 పైసలు, డీజిల్ 40 పైసలు ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ కొత్త ధరలను విడుదల చేస్తాయి. నేడు కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో చమురు కంపెనీలు ఎలాంటి మార్పు చేయలేదు. దాదాపు ఏడు నెలలుగా పెట్రోలు, డీజిల్ ధరలను ఆయిల్ కంపెనీలు మార్చలేదు. అంతకుముందు ఏప్రిల్ 7న వాటి ధరలు చివరిసారిగా సవరించాయి. అయితే మే 22న పెట్రోల్‌ డీజిల్ పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ప్రపంచంలోనే అత్యధికంగా ముడి చమురును దిగుమతి చేసుకునే దేశం చైనా. చైనాలో ఆర్థిక వృద్ధి మందగించవచ్చన్న భయాలు ముడి చమురు డిమాండ్ పై పెట్టుబడిదారుల ఆందోళనలను మరోసారి లేవనెత్తాయి.

అయితే బ్రెంట్ చమురు మంగళవారం ఉదయం 0.66 శాతం పెరిగి బ్యారెల్కు $ 93.42 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ముడి చమురు WTI బ్యారెల్‌కు 0.57 శాతం పెరిగి $ 87.02 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈరోజు అంటే నవంబర్ 1 నుంచి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.115 తగ్గింది. అయితే, దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్‌పి‌జి సిలిండర్ల ధరలలో ఈ తగ్గింపు ఉంటుంది. ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. 

సిటీ పెట్రోల్ డీజిల్
న్యూఢిల్లీ 96.72 89.62
ముంబై 106.31 94.27
కోల్‌కతా 106.03 92.76
చెన్నై 102.63 94.24
నోయిడా 96.79 89.96
లక్నో 96.57 89.76
జైపూర్ 108.48 93.72
పాట్నా 107.24 94.04
భోపాల్ 108.65 93.90
చండీగఢ్ 96.20 84.26
రాంచీ 99.84 94.65
భోపాల్ 108.65 93.90
గాంధీనగర్ 96.63 92.38
బెంగళూరు 101.94 87.89
గురుగ్రామ్ 97.18 90.05
హైదరాబాద్ 109.66 97.82

ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) క్రూడాయిల్ ధరల ఆధారంగా ప్రతిరోజు ఇంధన ధరలను సమీక్షించి ఉదయం 6 గంటలకు కొత్త ధరలను విడుదల చేస్తాయి. వివిధ రాష్ట్రాలలో వేర్వేరు VAT రేట్ల కారణంగా పెట్రోల్ - డీజిల్ ధరలు అన్నీ రాష్ట్రాలలో ఒకే విధంగా ఉండవు.