పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఈ మేరకు దేశంలోని ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీలు సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 40 పైసలు చొప్పున పెరిగాయి.  

పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. దేశంలోని ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీలు సోమ‌వారం (ఏప్రిల్ 4, 2022) పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు 40 పైసలు చొప్పున పెరిగాయి. వ‌రుస‌గా 14 రోజుల్లో పెట్రోల్ ధ‌ర‌లు పెర‌గడం ఇది 12వ సారి. గత 14 రోజుల్లో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.8.40 పెరిగింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.117.53కి చేరింది. లీటర్ డీజిల్‌ ధర రూ.103.60కి చేరింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (IOCL) చమురు ధరలకు సంబంధించి సోమ‌వారం (ఏప్రిల్ 04, 2022) కొత్త ధరలను విడుదల చేశాయి. దేశీయంగా సోమ‌వారం ధ‌ర‌ల్లో మార్పు చోటుచేసుకున్నాయి. సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇటీవల పైకి, కిందకు కదులుతున్నాయి. ఈ ప్రభావం దేశీయంగా పెట్రోల్, డీజిల్ పైన ఉంటుంది.

పెట్రోల్‌, డీజిల్ ధరలివే..!

- దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 103.81 కాగా, డీజిల్‌ రూ. 95.07 వద్ద కొనసాగుతోంది.

- దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 118.83 కాగా, డీజిల్‌ రూ. 103.07గా ఉంది.

- చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 109.34 కాగా, డీజిల్ రూ. 99.42గా నమోదైంది.

- బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ. 109.41 కాగా, డీజిల్‌ రూ. 93.23 వద్ద కొనసాగుతోంది.

- కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 113.45 కాగా, డీజిల్ ధర లీటర్ కు రూ. 98.22గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..!

- హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 117.53 వద్ద కొనసాగుతుండగా, డీజిల్‌ రూ. 103.60గా ఉంది.

- విజ‌య‌వాడ‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ. 118.55కాగా, డీజిల్‌ రూ. 105.90కి చేరింది.

పెట్రోల్-డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతాయి. ఉదయం 6 గంటలకు సవరిస్తారు. మీరు రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు (How to check diesel petrol price daily). ఇండియన్ ఆయిల్ కస్టమర్లు సిటీ కోడ్‌తో పాటు RSPని 9224992249కి పంపడం ద్వారా, BPCL కస్టమర్‌లు RSPని 9223112222 నంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అదే సమయంలో, HPCL వినియోగదారులు HP Price అని టైప్ చేసి 9222201122 నంబర్‌కు మెసేజ్ పంపడం ద్వారా ధరను తెలుసుకోవచ్చు.