అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. ఈ ఆరు రోజుల్లో ఐదుసార్లు 80 పైసల చొప్పున పెరిగాయి. దీంతో పలు ప‌ట్ట‌ణాల్లో పెట్రోల్ ధ‌ర‌లు చుక్కులు చూపిస్తున్నాయి. 


పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం (మార్చి 27, 2022) పెరిగాయి. వరుసగా రెండు రోజుల పెరుగుదల తర్వాత ఒకరోజు స్థిరంగా ఉన్న ధరలు, మళ్లీ మూడు రోజులు వరుసగా 80 పైసల చొప్పున పెరిగాయి. ఈ ఆరు రోజుల్లో ఐదుసార్లు కూడా 80 పైసల చొప్పున పెరిగాయి. నవంబర్ 4, 2021 తర్వాత మార్చి 22వ తేదీ నుండి ధరలు పెరుగుతున్నాయి. మధ్యలో ఒకరోజు స్థిరంగా ఉంది. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు ఇటీవల భారీగా పెరిగి, ఆ తర్వాత కాస్త శాంతించాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్లుగా కనిపించడంతో ధరలు కాస్త క్షీణించాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (IOCL) చమురు ధరలకు సంబంధించి నేడు (మార్చి 27, 2022) కొత్త ధరలను విడుదల చేశాయి. ఆదివారం పెట్రోల్‌పై 50 పైస‌లు, డీజిల్‌పై 55పైస‌లు పెరిగాయి. సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. నాలుగు రోజుల నుండి పెరుగుదల కనిపించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇటీవల పైకి, కిందకు కదులుతున్నాయి. ఈ ప్రభావం దేశీయంగా పెట్రోల్, డీజిల్ పైన ఉంటుంది.


పెట్రోల్‌, డీజిల్ ధరలివే..!

- దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 99.11 కాగా, డీజిల్‌ రూ. 90.42 వద్ద కొనసాగుతోంది.

- దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 113.88 కాగా, డీజిల్‌ రూ. 98.13గా ఉంది.

- చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 104.90 కాగా, డీజిల్ రూ. 95గా నమోదైంది.

- బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ. 104.44 కాగా, డీజిల్‌ రూ. 88.66 వద్ద కొనసాగుతోంది.

- కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 108.53 కాగా, డీజిల్ ధర లీటర్ కు రూ. 93.57గా ఉంది.

- ల‌క్నోలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 98.94 కాగా, డీజిల్ ధర లీటర్ కు రూ. 90.55గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..!

- హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 112.35 వద్ద కొనసాగుతుండగా, డీజిల్‌ రూ. 98.68గా ఉంది.

- విజ‌య‌వాడ‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ. 114.06కాగా, డీజిల్‌ రూ. 100.08కి చేరింది.

పెట్రోల్-డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతాయి. ఉదయం 6 గంటలకు సవరిస్తారు. మీరు రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు (How to check diesel petrol price daily). ఇండియన్ ఆయిల్ కస్టమర్లు సిటీ కోడ్‌తో పాటు RSPని 9224992249కి పంపడం ద్వారా, BPCL కస్టమర్‌లు RSPని 9223112222 నంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అదే సమయంలో, HPCL వినియోగదారులు HP Price అని టైప్ చేసి 9222201122 నంబర్‌కు మెసేజ్ పంపడం ద్వారా ధరను తెలుసుకోవచ్చు.