వాహనదారులకు అలర్ట్. పెట్రోల్, డీజిల్ ధరలు గురువారం నిలకడగానే కొనసాగాయి. గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన ఇంధన ధరలు గురువారం మాత్రం స్థిరంగా ఉన్నాయి. అయితే గ్లోబల్ మార్కెట్‌లో మాత్రం ముడి చమురు రేట్లు పెరిగాయి. 

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు బ్రేకులు పడ్డాయి. గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన ఇంధన ధరలు గురువారం (మార్చి 24, 2022) మాత్రం నిలకడగానే కొనసాగాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని చెప్పుకోవచ్చు. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం ముడి చమురు ధరలు పైపైకి చేరుతూనే వస్తున్నాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తెలంగాణ హైదరాబాద్‌లో గురువారం పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 109.99 వద్దనే కొనసాగుతోంది. డీజిల్ రేటు కూడా ఇదే దారిలో నడిచింది. డీజిల్ ధరలో కూడా మార్పు లేదు. దీంతో డీజిల్ రేటు రూ. 96.35 వద్దనే కొనసాగుతోంది. ఏపీ గుంటూరు అమరావతిలో కూడా పెట్రోల్ ధర ఇదే దారిలో నడిచింది. పెట్రోల్ రేటులో మార్పు లేదు. రూ. 112.08 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ రేటు కూడా నిలకడగా కొనసాగింది. డీజిల్ ధర రూ. 98.1 వద్దనే ఉంది.

పెట్రోల్‌, డీజిల్ ధరలివే..!

- దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 97.01 కాగా, డీజిల్‌ రూ. 88.27 వద్ద కొనసాగుతోంది.

- దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 111.67 కాగా, డీజిల్‌ రూ. 95.85గా ఉంది.

- చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 102.91 కాగా, డీజిల్ రూ. 92.95గా నమోదైంది.

- బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ. 102.26 కాగా, డీజిల్‌ రూ. 86.58 వద్ద కొనసాగుతోంది.

- కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 106.34 కాగా, డీజిల్ ధర లీటర్ కు రూ. 91.42గా ఉంది.

- ల‌క్నోలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 96.87 కాగా, డీజిల్ ధర లీటర్ కు రూ. 88.42గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..!

- హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 110 వద్ద కొనసాగుతుండగా, డీజిల్‌ రూ. 96.36గా ఉంది.

- గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 112.08 కాగా, డీజిల్‌ రూ. 98.10గా ఉంది.

పెట్రోల్-డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతాయి. ఉదయం 6 గంటలకు సవరిస్తారు. మీరు రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు (How to check diesel petrol price daily). ఇండియన్ ఆయిల్ కస్టమర్లు సిటీ కోడ్‌తో పాటు RSPని 9224992249కి పంపడం ద్వారా, BPCL కస్టమర్‌లు RSPని 9223112222 నంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అదే సమయంలో, HPCL వినియోగదారులు HP Price అని టైప్ చేసి 9222201122 నంబర్‌కు మెసేజ్ పంపడం ద్వారా ధరను తెలుసుకోవచ్చు.