Asianet News TeluguAsianet News Telugu

Petrol Diesel Prices Today: నేటి పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లివే.. తగ్గాయా..? పెరిగాయా..?

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా కదిలాయి. క్రూడాయిల్‌ ధరలు చేరోదారిలో నడిచాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.45 శాతం క్షీణించింది.

Petrol Diesel Prices Today
Author
Hyderabad, First Published Jan 25, 2022, 9:16 AM IST

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా కదిలాయి. క్రూడాయిల్‌ ధరలు చేరోదారిలో నడిచాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.45 శాతం క్షీణించింది. దీంతో బ్రెంట్ ఆయిల్ ధర 85.87 డాలర్లకు తగ్గింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర మాత్రం పైపైకి కదిలింది. 0.36 శాతం పైకి చేరింది. దీంతో ఈ రేటు 83.58 డాలర్లకు ఎగసింది.

పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు స్థిరంగానే కొన‌సాగుతున్నాయి. గత కొన్ని నెలలుగా పెద్దగా మార్పులు లేకుండానే కొనసాగుతోంది. ఇండియన్ ఆయిల్ (IOCL) పెట్రోల్, డీజిల్ కొత్త రేట్లను మంగ‌ళ‌వారం తాజాగా విడుదల చేసింది. మెట్రో నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా కనిపించాయి. ఈ వివరాలను వెబ్ సైట్  అందించిన సమాచారం ప్రకారం ఈవిధంగా ఉన్నాయి. 

- ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 95.41, డీజిల్ లీటర్ కు రూ. 86.67

- చెన్నైలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 101.40, డీజిల్ ధర లీటర్ కు రూ. 91.43

- కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 104.67, డీజిల్ ధర లీటర్ కు రూ. 89.79

- త్రివేండ్రంలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 106.36, డీజిల్ ధర లీటర్ కు రూ. 93.47

- హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 108.20, డీజిల్ ధర లీటర్ కు రూ. 94.62

- విశాఖ‌ప‌ట్నంలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 109.05, డీజిల్ ధర లీటర్ కు రూ. 95.18

- బెంగళూరులో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 100.58, డీజిల్ ధర లీటర్ కు రూ. 85.01

- జైపూర్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 107.06, డీజిల్ ధర  లీటర్ కు రూ. 90.70

- లక్నోలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 95.28, డీజిల్ ధర లీటర్ కు రూ. 86.80

- భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 101.81, డీజిల్ ధర లీటర్ కు రూ. 91.62

 - ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.

కాగా భారత్ ప్రధానంగా పెట్రోల్, డీజిల్ కోసం ముడి చమురు దిగుమతులపైన ఆధారపడుతున్న విషయం తెలిసిందే. అందువల్ల క్రూడ్ ధరలు అనేవి పెట్రోల్, డీజిల్ రేట్లను ప్రభావితం చేస్తాయి. ఇంకా డిమాండ్ పెరగడం, ప్రభుత్వ పన్నులు, రూపాయి డాలర్ విలువలో మార్పు, రిఫైనరీ కన్సప్చన్ రేషియో వంటి అంశాల వల్ల కూడా దేశీ ఇంధన ధరలపై ప్ర‌భావం ఉంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios