దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగిశాయి. మరో రెండు రోజుల్లో ఫలితాలు వెలవడనున్నాయి. అయితే... ఇలా ఆదివారంతో పోలింగ్ ముగిసిందో లేదో... పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయాయి. వరసగా రెండో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. మంగళవారం పెట్రోల్ ధర 5పైసలు, డీజిల్ ధర 9నుంచి 10 పైసలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు పైకి ఎగిశాయి. 

బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.43 శాతం పెరుగుదలతో 72.28 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.46 శాతం పెరుగుదలతో 63.50 డాలర్లకు ఎగసింది. దేశీయంగా పెట్రోలు ధరలను ప్రభావితం చేస్తోంది.  దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 5 పైసలు పెరుగుదలతో రూ.71.17కు చేరింది. డీజిల్ ధర 9 పైసలు పెరుగుదలతో రూ.66.20కు ఎగసింది.

వివిధ ప్రాంతాల్లో ఇందన ధరలు ఇలా ఉన్నాయి.

ముంబయి..పెట్రోల్ 76.78, డీజిల్ రూ.69.36
కోల్ కత్తా..పెట్రోల్ 73.24, డీజిల్ రూ.697.6
చెన్నై..పెట్రోల్ 73.87 , డీజిల్ రూ.69.97
హైదరాబాద్..పెట్రోల్ 76.78, డీజిల్ రూ..71.99
అమరావతి..పెట్రోల్ 75.24, డీజిల్ రూ.71.6
విజయవాడ..పెట్రోల్ 74.89, డీజిల్ రూ.71.03